
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా రోజుల తర్వాత ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ తో మనముందుకు వస్తున్నారు. ‘సన్ ఆఫ్ ఇండియా’ పేరుతో తెరకెక్కిన సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మోహన్ బాబు స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మంచు విష్ణు ఈ మూవీని నిర్మిస్తున్నారు.
వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్ర కథను తయారు చేశారు. అందుకే నేచురల్ గా విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది.
తాజాగా ‘సన్ ఆఫ్ ఇండియా’ టీజర్ ను తమిళ స్టార్ హీరో సూర్య విడుదల చేశారు. మోహన్ బాబు చిత్రానికి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. వీళ్లదరికి పడదు అని ఇండస్ట్రీలో టాక్ ఉన్నా.. ఆ మధ్య కలిసిపోయారు. ప్రస్తుతం సినిమాలకు సాయం చేసుకుంటున్న పరిస్థితి ఉంది.
చిరంజీవి మోహన్ బాబు పాత్ర గురించి వివరిస్తాడు. ఇక విభిన్నమైన గెటప్ లలో మోహన్ బాబు సినిమాలో కనిపస్తున్నారు. పాత్రలు పవర్ ఫుల్ గా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇక టీజర్లో చివరలో మోహన్ బాబు ఒకే ఒక్క డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ‘చీకటిలో ఉండే వెలుతురిని’ అంటూ మోహన్ బాబు ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.
ఈ సినిమా శ్రీకాంత్, ప్రగ్యాజైస్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, ఫృథ్వీరాజ్, రాజా రవీంద్ర, రఘురాబాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తుండడం విశేషం. ఈ చిత్ర టీజర్ ఆకట్టుకుంటోంది.
-సన్ ఆఫ్ ఇండియా టీజర్