Senior Actress: డ్రగ్స్ కేసులో ‘ఆర్యన్ ఖాన్’ అడ్డంగా బుక్ అయ్యాడు. సహజంగా ఒక కుర్రాడు డ్రగ్స్ తీసుకుంటూ దొరికితే ఏమి చేస్తారు ? అతని పై సానుభూతి ఎవరైనా ప్రకటిస్తారా ? కచ్చితంగా తను మళ్ళీ డ్రగ్స్ జోలికి వెళ్లకుండా కఠినంగా శిక్షిస్తారు. కానీ బాలీవుడ్ సూపర్ స్టార్ ‘షారుక్ ఖాన్’ కొడుకు ‘ఆర్యన్ ఖాన్’ విషయంలో అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంది. కనీసం మందలించడానికి కూడా ఎవరు ధైర్యం చేయడం లేదు.

పైగా ఆ కుర్రాడికి మద్దతులు ఇస్తున్నారు, సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ ప్రకటిస్తూ సానుభూతిని ప్రకటిస్తున్నారు. స్టార్ హీరో కొడుకు కాబట్టి.. ఆ కుర్రాడికి అందరూ మద్దతు ఇస్తున్నారు. అదే ఏ సామాన్యుడి కొడుకు అయి ఉంటే ఇలాగే మద్దతు ఇస్తారా ? ఇప్పటికే సల్మాన్ ఖాన్, పూజా భట్, హృతిక్ రోషన్, అలాగే చాలామంది నటీనటులు పబ్లిక్ గా సపోర్టు చేశారు.
తాజాగా ఇప్పుడు సోమీ అలీ కూడా సోషల్ మీడియా ద్వారా ఆర్యన్ ఖాన్ కి మద్దతు ఇచ్చింది. ఇస్తే ఇచ్చింది.. ఈ సందర్భంగా కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. ఆర్యన్ చేసింది తప్పు కాదంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ పోస్ట్ చేసింది. ‘అసలు, పిల్లలు డ్రగ్స్ వాడడం అనేది చాలా సహజం. ఆర్యన్ డ్రగ్స్ వాడటం నాకు విచిత్రంగా అనిపించలేదు. వ్యభిచారం, డ్రగ్స్ వంటి వాటిని మన జీవితాల్లో నుంచి మనం తొలగించలేం. కాబట్టి, వాటిని క్రిమినల్ జాబితాలోంచి తొలగించాలి. నేను కూడా 15 ఏళ్ల వయసులో డ్రగ్స్ తీసుకున్నాను’ అని సోమీ సగర్వంగా చెప్పుకొచ్చింది.
పిల్లలు డ్రగ్స్ వాడడం అనేది చాలా సహజం అని చెప్పడం ఒక్క సోమీ అలీకే సాధ్యం అయింది. పైగా ‘ఆందోళన్’ అనే సినిమా షూటింగ్ సమయంలో దివ్యభారతితో కలిస్ సోమీ అలీ డ్రగ్స్ తీసుకుందట. ఈ విషయాన్ని ఈ సీనియర్ నటి గర్వంగా చెప్పింది. పైగా ఈ విషయాలు చెప్పడానికి తనకు ఎలాంటి గిల్ట్ ఫీలింగ్ లేదని తెలియజేసింది.