Homeఎంటర్టైన్మెంట్ట్రైలర్ టాక్: ప్రేమ,పెళ్లి వద్దు సోలో బ్రతుకే ముద్దు అంటున్న సుప్రీమ్ హీరో

ట్రైలర్ టాక్: ప్రేమ,పెళ్లి వద్దు సోలో బ్రతుకే ముద్దు అంటున్న సుప్రీమ్ హీరో

Solo Brathuke So Better
రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మార్గదర్శకాలని అనుసరిస్తూ ఇప్పుడిప్పుడే థియేటర్ లలో సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ ఈ సమయంలో మూవీ లవర్స్ థియేటర్ కి వచ్చి చూడటానికి కొంచెం ఆలోచిస్తున్నారు. వాళ్ళందర్నీ థియేటర్ కి పరుగెత్తించాలంటే సరైన సినిమా రావాలి. ఓటిటి లో అన్ని మూవీస్ ని చూడలేమని , కొన్ని సినిమాలని థియేటర్ లోనే చూడాలని , అప్పుడే మజా వస్తుందని అలాంటి మాజాని తన సినిమా “సోలో బ్రతుకే సో బెటర్‌” అందిస్తుందని మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ భరోసా ఇస్తున్నాడు. రీసెంట్ గా ట్రైలర్ ని విడుదల చేయటం జరిగింది.

Also Read: ‘నేడే విడుదల’ ఫస్ట్ లిరికల్ సాంగ్..

ప్రేమ, పెళ్లి అంటే పడని తేజు, యూత్‌ తన దారిలో నడవాలని అనుకుంటూ వాళ్ళని మోటివేట్ చేస్తుంటాడు. అలా ఉన్న హీరోకి హీరోయిన్ నభా నటేష్ పరిచయం కావడంతో సినిమా కథ ఎలా మలుపు తిరిగింది అనే విషయాన్ని ఈ సినిమాలో చాలా ఎంటర్‌టైనింగ్‌గా చూపించనున్నట్లు మనకు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.కాగా బ్యాచ్‌లర్‌గా తనకు ఎంతో స్పూర్తినిచ్చే నటుడు ఆర్.నారాయణమూర్తి టీవీలో పెళ్లి చేసుకోవాలని యూత్‌కు చెబుతుండటంతో తేజు ఫ్యూజులు ఎగిరిపోయే కామెడీ సీన్‌తో ఈ ట్రైలర్‌ను ముగించారు.దర్శకుడు సుబ్బు ఈ సినిమాలో ఏం చెప్పాలనుకున్నాడో అది స్పష్టంగా ట్రైలర్‌లో కనిపిస్తోంది.ఇక తేజు ఈ సినిమాలో చాలా బాగా నటించాడని చిత్ర యూనిట్ నుండి అందుతున్న సమాచారం.

Also Read: రాజుగారి బూతు సినిమా ‘డర్టీ హరి’ ఎలా ఉందంటే ?

సాయిధరమ్‌ తేజ్‌, నభా నటేష్‌ జంటగా నటిస్తున్న ఈ సినిమా యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ‘సుబ్బు’ దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. రాజేంద్ర ప్రసాద్‌, రావు రమేష్‌, నరేష్‌, సత్య, వెన్నెల కిషోర్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఏడాది వేసవి కాలంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ముందుగా ఓటీటీలో విడుదల చేయాలని భావించగా ఇటీవల థియేటర్లు తెరుచుకోవడంతో పెద్ద స్క్రీన్‌ మీద సందడి చేసేందుకు సిద్ధమైంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ‘సోలో బ్రతుకే సో బెటర్’ను థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

https://youtu.be/CtRvAZSQH5I

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular