Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్లో ఏదైనా జరగొచ్చు. ఎందుకంటే ఇక్కడ బిగ్ బాస్ దే తుది నిర్ణయం. కంటెస్టెంట్స్ ప్రశ్నించడానికి లేదు. ఆయన ఏది చెబితే అదే కరెక్ట్. ఒకసారి ఎలిమినేటై వెళ్ళిపోయిన కంటెస్టెంట్ రీ ఎంట్రీ ఇవ్వడానికి వీల్లేదు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొందరు కంటెస్టెంట్స్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. తెలుగు బిగ్ బాస్ షోలో సీజన్ 2లో మొదటిసారి ఇలా జరిగింది. నూతన్ నాయుడు అనే కంటెస్టెంట్ కాలికి గాయమైంది. దాంతో అతడు బయటకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుని మరలా వచ్చాడు.
అలాగే సీజన్ 3లో కూడా ఇది జరిగింది. కంటెస్టెంట్ అలీ రైజా 7వ వారం ఎలిమినేట్ అయ్యాడు. అతడి ఎలిమినేషన్ పై వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో అతడిని తిరిగి హౌస్లోకి పంపారు. సెకండ్ ఛాన్స్ దక్కించుకున్న అలీ రైజా ఫైనల్ కి వెళ్ళాడు. అతడు 4వ రన్నర్ గా నిలిచాడు. గత మూడు సీజన్స్ లో ఎలిమినేటైన వారు తిరిగి హౌస్లోకి రాలేదు. సీజన్ 4లో గంగవ్వ, నోయల్ ఆరోగ్య కారణాలతో బయటకు వచ్చేశారు.
అయినా వీరిద్దరూ రీ ఎంట్రీ ఇవ్వలేదు. లేటెస్ట్ సీజన్లో టాప్ కంటెస్టెంట్ గా ఉన్న రతికా రోజ్ రీఎంట్రీ ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అభ్యర్థనలు పెడుతున్నారు. ఆమె గేమ్ తప్పుదోవపట్టింది. రతికా రోజ్ కి ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ క్రమంలో రతికా రోజ్ మరలా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే ఛాన్స్ కలదు.
బయటకు వచ్చిన వాళ్ళు లోపలికి పోతే ఆడియన్స్ మూడ్ తెలిసిపోతుంది. ఎవరు టాప్ లో ఉన్నారు? ఎవరు వెనుకబడ్డారో? తెలుస్తుంది. దాని ఆధారంగా వాళ్ళు గేమ్ ఆడే అవకాశం ఉంటుంది. ఒకవేళ రతికా రోజ్ రీఎంట్రీ ఇస్తే ఆమెకు చాలా ప్లస్ అవుతుంది. అసలుకే పెద్ద ముదురు. ఇకపై మరింత స్ట్రాటజిక్ గేమ్ ఆడే అవకాశం ఉంది. మరి చూడాలి, నిర్వాహకులు సోషల్ మీడియా అభ్యర్థనలను ఎలా తీసుకుంటారో…