Sobhita : సినీ పరిశ్రమలో తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ సీరియల్ హీరోయిన్ శోభిత శివన్న నిన్న హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. కన్నడ లో ‘బ్రహ్మ గొంతు’ అనే టీవీ సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించిన ఈమె, ఆ తర్వాత అనేక సూపర్ హిట్ సీరియల్స్ లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కించుకుంది. పలు కన్నడ సినిమాల్లో కూడా ఈమె కీలక పాత్రలు పోషించింది. కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న ఈ సమయంలో ఆమె ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఆమె అభిమానులను, కుటుంబ సభ్యులను శోకసంద్రం లోకి నెట్టేసింది. అసలు ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమిటి?, నిజంగా ఆత్మహత్య చేసుకుండా, లేదా ఈమె మరణం వెనుక ఏదైనా కుట్ర దాగుందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న శోభిత సీరియల్స్ కి దూరంగా ఉంటూ వచ్చింది.
నకలేష్ పూర్ లో పుట్టి పెరిగిన శోభిత చదువు పూర్తి అవ్వగానే సినీ ఇండస్ట్రీ మీద మక్కువతో మోడలింగ్ రంగంలోకి వచ్చింది. గాలిపట అనే సీరియల్ ద్వారా తొలిసారి కన్నడ ఆడియన్స్ కి పరిచయమైనా ఈమెకు ఆ తర్వాత పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించే అవకాశం దక్కింది. ఈమె కెరీర్ ని మలుపు తిప్పిన సీరియల్ మాత్రం ‘బ్రహ్మ గొంతు’. ఇందులో పోషించిన పాత్రకు పలు అవార్డ్స్ కూడా వచ్చాయి. రెండేళ్ల క్రితమే ఈమె ఘనంగా పెళ్లి చేసుకుంది. సంతోషవంతమైన జీవితం గడుపుతుంది అని అందరూ ఆశించే లోపు ఈ ఘటన చోటు చేసుకుంది. శోభిత మరణం పట్ల సినీ ఇండస్ట్రీ మొత్తం ఆమెతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు. ఆమె ఆత్మకి ఎక్కడున్నా శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
పెళ్లికి ముందు ఈమెకు పలు తెలుగు టీవీ సీరియల్స్ లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది. అంతే కాదు బిగ్ బాస్ సీజన్ 7 లో ఈమెకు ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం కూడా దక్కింది. టీవీ సీరియల్స్ ఒప్పుకోలేదు కానీ, బిగ్ బాస్ కి మాత్రం రావాలని అనుకుందట. కానీ ఎందుకో చివరి నిమిషం లో డ్రాప్ అయ్యింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అయినా ఈమెని తీసుకొద్దామని అనుకున్నారు, కానీ కుదర్లేదు. ఆ తర్వాత ఈమె పూర్తి కెమెరా కి దూరం అవ్వడంతో బిగ్ బాస్ సీజన్ 8 కి ఈమెని సంప్రదించలేదు. కేవలం 31 ఏళ్ళ వయస్సు ఉన్న ఈమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరం. సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా అప్పుడప్పుడు తన కుటుంబ సభ్యుల ఫోటోలను, వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉండేది.