https://oktelugu.com/

Sobhita Dhulipala: సమంత విషయంలో నాగ చైతన్య అలా ప్రవర్తించడం నాకు నచ్చింది..అందుకే అతన్ని ప్రేమించాను : శోభిత ధూళిపాళ్ల

పెళ్ళికి ముందు సంప్రదాయబద్దంగా జరగాల్సిన ప్రతీ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ, శోభిత ఈ పెళ్లి జరుపుకోనుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో ఆమె ఇది వరకే అప్లోడ్ చేసింది. అచ్చ తెలుగు అమ్మాయిగా పిలవబడే ఈమె, ఎక్కువగా బాలీవుడ్ లోనే సినిమాలు చేయడంతో మన తెలుగు సంప్రదాయాలను మర్చిపోయి ఉంటుందని అందరూ అనుకోవచ్చు.

Written By:
  • Vicky
  • , Updated On : December 2, 2024 / 11:08 AM IST

    Sobhita Dhulipala

    Follow us on

    Sobhita Dhulipala: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా నాగ చైతన్య, శోభిత నే కనిపిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ క్యూట్ జంట మూడు మూళ్ళ బంధం తో ఒక్కటి కాబోతుంది. ఆగస్టు నెలలో నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట, ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో బంధు మిత్రుల సమక్షంలో గ్రాండ్ గా వివాహం చేసుకోనున్నారు. మిగిలిన సెలబ్రిటీస్ లాగా కాకుండా డెస్టినేషన్ వెడ్డింగ్ ని పక్కన పెట్టి, నివసిస్తున్న నగరం లోనే వీళ్ళ వివాహం జరగబోతుండడం ని పలువురు ప్రశంసిస్తున్నారు. పెళ్ళికి ముందు సంప్రదాయబద్దంగా జరగాల్సిన ప్రతీ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ, శోభిత ఈ పెళ్లి జరుపుకోనుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో ఆమె ఇది వరకే అప్లోడ్ చేసింది. అచ్చ తెలుగు అమ్మాయిగా పిలవబడే ఈమె, ఎక్కువగా బాలీవుడ్ లోనే సినిమాలు చేయడంతో మన తెలుగు సంప్రదాయాలను మర్చిపోయి ఉంటుందని అందరూ అనుకోవచ్చు.

    కానీ ఈమె అందరి అంచనాలకు భిన్నంగా వ్యవహరించడం ప్రశంసనీయమే. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో నాగ చైతన్య గురించి మాట్లాడడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘నాగ చైతన్య ని నేను ఇష్టపడడానికి కారణం ఆయనలోని మానవత్వమే. ఎలాంటి పరిస్థితులు వచ్చినా తన కూల్ స్వభావాన్ని వదలడు. తన కంటే పెద్దవాళ్ళను, తనకంటే చిన్నవాళ్లను ఆయన గౌరవించే తీరుని మాటల్లో చెప్పలేను. ఈ లక్షణాలన్నీ నన్ను ఆయన్ని ప్రేమించేలా చేసాయి. ముఖ్యంగా నా తల్లిదండ్రులకు ఆయన ఎంతో విలువ ఇస్తాడు. నా సోదరి సమంత ని కూడా ఎంతో గౌరవమిస్తాడు, ఆమెకి ఎన్నో గొప్ప సలహాలు కూడా ఇస్తాడు. ఇలాంటి వ్యక్తి నా జీవితంలోకి రావడం నేను చేసుకున్న అదృష్టం’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    అయితే ఒక్క సినిమాలో కూడా కలిసి నటించని వీళ్లిద్దరు ఎలా ప్రేమించుకున్నారు?, వీళ్ళ మధ్య పరిచయం అసలు ఎలా ఏర్పడింది? అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీ గానే మిగిలింది. రీసెంట్ గానే నాగ చైతన్య అమెజాన్ ప్రైమ్ లో రానా దగ్గుబాటి నిర్వహించే టాక్ షో లో పాల్గొన్నాడు. కనీసం ఇక్కడైనా ఆయన వీళ్ళ మధ్య ప్రేమ ఎలా పుట్టిందో చెప్తాడేమో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఆయన సాయి పల్లవి తో కలిసి చందు మొండేటి దర్శకత్వం లో ‘తండేల్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 వ తారీఖున విడుదల కాబోతుంది. అల్లు అరవింద్ ఈ సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ లో సుమారు 70 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేసి తెరకెక్కిస్తున్నాడు.