Sobhita Dhulipala: నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) తో పెళ్లి తర్వాత సినిమాలకు, వెబ్ సిరీస్ లకు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చిన శోభిత ధూళిపాళ, మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుందా లేదా అనే అనుమానం అభిమానుల్లో ఉండేది. చాలా మంది ఈమె నటనకు ఇక పూర్తిగా దూరం కాబోతుంది అంటూ చెప్పుకొచ్చారు. కానీ రీసెంట్ గానే ఆమె షూటింగ్ లో జాయిన్ అయ్యి అందరినీ సర్ప్రైజ్ కి గురి చేసింది. అంతే కాదు ఒక సినిమాని కూడా పూర్తి చేసింది. ఇది పెళ్ళికి ముందు మొదలైందా?, లేదా పెళ్లి తర్వాత మొదలైందా అనేది స్పష్టమైన క్లారిటీ లేదు. ఆ వెబ్ సినిమా పేరు ‘చీకట్లో’. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించగా శరన్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించాడు. షూటింగ్ కార్యక్రమాలు, మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసుకున్న ఈ సినిమా అతి త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది.
కేవలం భారతీయ ప్రాంతీయ భాషల్లోనే కాదు, ఏకంగా 18 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారట. ఓటీటీలో ఒక వెబ్ సినిమాని ఇన్ని భాషల్లో డబ్ చేసి విడుదల చేయడం, అది కూడా ఒక తెలుగు సినిమాకు ఇదే మొదటిసారి అని అంటున్నారు విశ్లేషకులు. నవంబర్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ లో తెరకెక్కే సినిమాలు చాలా కొత్త రకమైన కాన్సెప్ట్స్ తో తెరకెక్కుతుంటాయి. ఈ బ్యానర్ నుండి ఒక సినిమా విడుదల అవ్వబోతుంది అంటే చాలు, భారీ హిట్ అని బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతుంది ట్రేడ్. అలాంటి బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఈ బ్యానర్ నుండి ఈ చిత్రం విడుదల కాబోతుంది అనే సమాచారం తెలియడం తో , ఈ సినిమా పై అంచనాలు భారీ లెవెల్ లో ఏర్పడ్డాయి. పైగా ‘చీకట్లో’ అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టడం తో ఆడియన్స్ లో అసలు ఈ సినిమా ఏ జానర్ అయ్యుంటుంది అనే సందేహాలు మొదలయ్యాయి.
ఈ టైటిల్ ని బట్టి చూస్తే, ఈ సినిమా రెండు జానర్స్ లో తెరకెక్కిన సినిమాగా ఒక అంచనా వేయొచ్చు. మొదటి జానర్ హారర్ అయ్యుండొచ్చు. రెండవది అడల్ట్ రేటెడ్ కంటెంట్ సినిమా అయ్యుండొచ్చు. ఇవి రెండు కాకుండా, ఇందులో హీరోయిన్ కళ్ళు లేని అమ్మాయిగా కనిపించి ఉండొచ్చు. ఈ మూడిట్లో ఎదో ఒకటి అయ్యుండొచ్చు అని అనుకుంటున్నారు ఆడియన్స్. సురేష్ ప్రొడక్షన్స్ నుండి వస్తున్న సినిమా కాబట్టి, కచ్చితంగా అడల్ట్ రేటెడ్ సినిమా అయ్యుండదు అని అంటున్నారు విశ్లేషకులు. హారర్ సినిమానే అయ్యుండొచ్చని అంటున్నారు. ఈ సస్పెన్స్ కి తెరపడాలంటే డైరెక్టర్ లేదా నిర్మాత సురేష్ బాబు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి మాట్లాడాల్సిందే.