https://oktelugu.com/

Sobhita Dhulipala: సమంత అందరి లాంటి అమ్మాయి కాదు అంటూ శోభిత దూళిపాళ్ల సెన్సేషనల్ కామెంట్స్!

ఏమి జరిగిందో, అసలు నిజం ఏమిటో ఎవ్వరూ దగ్గరుండి చూడలేదు కాబట్టి, ఎవరిదీ తప్పు, ఎవరిదీ ఒప్పు అనేది చెప్పలేకపోతున్నారు విశ్లేషకులు. కానీ ఉన్న ఆధారాలు, జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే నాగ చైతన్యదే తప్పు ఉన్నట్టుగా అనిపిస్తుందని అంటున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : August 12, 2024 / 12:34 PM IST

    Sobhita Dhulipala

    Follow us on

    Sobhita Dhulipala: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా సమంత, నాగ చైతన్య, శోభితా దూళిపాళ్ల పేర్లే వినిపిస్తున్నాయి. ఎందుకో అందరికీ తెలిసిందే, రీసెంట్ గానే నాగ చైతన్య పెద్దల సమక్ష్యం లో శోభిత తో నిశ్చితార్థం చేసుకున్నాడు. సమంత తో విడాకులు జరిగిన రెండు నెలల్లోనే శోభిత తో నాగ చైతన్య కలిసి తిరగడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటి నుండే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త ఫిలిం నగర్ నుండి లీక్ అయ్యాయి. కానీ సోషల్ మీడియా లో ఈమధ్య ఇలాంటి రూమర్స్ సాధారణమే కదా, వాళ్లిద్దరూ మంచి స్నేహితులు అయ్యుంటారు, లేదా ఏదైనా యాడ్ షూటింగ్ అయ్యుంటుంది అని అనుకున్నారు.

    ఇన్నీ రోజులు కూడా వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటే కొంతమంది అది రూమర్స్ అనే నమ్ముతూ వచ్చారు, ఎదో ఒక రోజు నాగ చైతన్య – సమంత మళ్ళీ కలిసిపోతారు అని అనుకునేవారు. కానీ అకస్మాత్తుగా నాగ చైతన్య శోభిత తో నిశ్చితార్థం చేసుకొని, ఆ నిశ్చితార్థం కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో అప్లోడ్ చెయ్యడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇదంతా పక్కన పెడితే శోభిత ఒక సినిమా ప్రమోషన్ లో సమంత గురించి ఒక యాంకర్ అడిగిన ప్రశ్న కి చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇది బహుశా రెండేళ్ల కృతానికి సంబంధించిన ఇంటర్వ్యూ అయ్యుండొచ్చు. ఈ ఇంటర్వ్యూ లో ఆమె సమంత గురించి మాట్లాడుతూ ‘సమంత అందరిలాంటి అమ్మాయి కాదు , చాలా కూల్ గా ఉండే అమ్మాయి. ఎంతపని ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా అందరితో ప్రేమగా మాట్లాడుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది శోభితా. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో ని చూసిన నెటిజెన్స్ సమంత, శోభిత కి ముందు నుండే పరిచయం ఉందని, సుప్రియ ద్వారా శోభితా అక్కినేని కుటుంబం మొత్తానికి ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యిందని సోషల్ మీడియా లో అనుకుంటూ ఉన్నారు. చాలా మంది శోభిత తో నాగ చైతన్య ఎఫైర్ పెట్టుకోవడం వల్లనే సమంత విడాకులు ఇచ్చిందని కూడా అంటున్నారు.

    ఏమి జరిగిందో, అసలు నిజం ఏమిటో ఎవ్వరూ దగ్గరుండి చూడలేదు కాబట్టి, ఎవరిదీ తప్పు, ఎవరిదీ ఒప్పు అనేది చెప్పలేకపోతున్నారు విశ్లేషకులు. కానీ ఉన్న ఆధారాలు, జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే నాగ చైతన్యదే తప్పు ఉన్నట్టుగా అనిపిస్తుందని అంటున్నారు. మరోపక్క అక్కినేని అభిమానులు సమంత తన పర్సనల్ అసిస్టెంట్ ప్రీతం తో రిలేషన్ పెట్టుకుందని, అనేకసార్లు ఇంస్టాగ్రామ్ లో ఆమె అతన్ని ట్యాగ్ చేసి ‘ఐ లవ్ యూ’ చెప్పిందని అంటున్నారు. ఇలా ఈ ఇరువురి అభిమానుల మధ్య సోషల్ మీడియా లో ఇప్పటికీ వాదనలు జరుగుతూనే ఉన్నాయి. మరోపక్క సమంత ఇప్పటి వరకు నాగ చైతన్య రెండవ పెళ్లిపై స్పందించకపోవడం గమనార్హం.