Skylab Telugu Movie Review
నటీనటులు: సత్య దేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ, తులసి శివమణి, తనికెళ్ల భరణి తదితరులు
దర్శకుడు: విశ్వక్ ఖండేరావు
సంగీత దర్శకుడు: ప్రశాంత్ విహారిసినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాదిఎడిటర్: రవితేజ గిరిజాల
నిర్మాతలు: నిత్యా మీనన్, ప్రవల్లిక పిన్నమరాజు, పృథ్వీ పిన్నమరాజు
రేటింగ్ : 2

స్కైలాబ్ అంటే.. ఈ తరం వారికీ పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, 1970 దశకం చివర్లో స్కైలాబ్ సృష్టించిన భయం మామూలుది కాదు. నాసా ప్రయోగించిన ఆ అంతరిక్ష నౌక ఎప్పుడు భూమ్మీద పడిపోతుందో అంటూ అప్పటి ప్రజలు చాలా భయపడ్డారు. ఆ కథతో వచ్చిన ఈ ‘స్కైలాబ్’ సినిమాలో నిత్యామీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. సినిమా ఎలా ఉందో రివ్యూ చూద్దాం.
కథ :
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతమైన బండలింగంపల్లిలో ఈ కథ జరుగుతుంది. ఆనంద్ (సత్యదేవ్) ఒక డాక్టర్. అయితే, అతనికి డబ్బు అవసరం అయి తన తాతగారి ఊరైన బండ లింగంపల్లికి వస్తాడు. అక్కడ అతను డబ్బు సంపాదించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ? ఈ మధ్యలో అతనికి సుబేదార్ రామారావు (రాహుల్ రామకృష్ణ)తో ఎలా పరిచయం అయింది ? వారిద్దరూ కలిసి అదే ఊర్లో క్లినిక్ ఎలా ప్రారంభించారు ? అనే కథకు సమాంతరంగా మరో కథ నడుస్తోంది. ఆ గ్రామంలో గౌరి (నిత్య మీనన్) ఒక జమీందార్ కుమార్తె. గౌరి ప్రతిబింబం అనే పత్రికలో జర్నలిస్ట్ గా పనిచేస్తోంది. ఆమె ఎప్పటికైనా రచయిత్రిగా పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ఉంటుంది. మరి గౌరి రచయిత్రిగా పేరు తెచ్చుకుందా ? లేదా ?, ఇక డబ్బు కోసం వచ్చిన డాక్టర్ ఆనంద్ కథ ఎలాంటి మలుపులు తిరిగింది ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
స్కైలాబ్ నేపథ్యంలో కథ రాసుకోవాలని ఆలోచించడమే మంచి పరిణామం. అయితే, ఆ ఆలోచన అయితే బాగుంది గానీ, కథలో విషయం లేదు. ఎందుకో అరుదైన నేపథ్యం అయినప్పటికీ.. కథలో ఇటు కామెడీ లేదు, అటు బలమైన భావోద్వేగాలు లేవు. దాంతో జరుగుతున్న డ్రామా అంతా ఎలాంటి ఇన్ వాల్వ్ లేకుండా సింపుల్ గా ముందుకు పోతూ ఉంటుంది. పైగా 1970 తెలంగాణ నేపథ్యాన్ని తెరపైకి పక్కాగా తీసుకురావడంలో కూడా మేకర్స్ ఫెయిల్ అయ్యారు.
అసలు సున్నితమైన కామెడీలో ఉత్కంఠ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని ఆలోచించుకో లేక పోవడం విచిత్రం. ఏది ఏమైనా ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపించకపోయింది. కాకపోతే కథలోని కొన్ని అంశాలు హృదయాల్ని కాస్త బరువెక్కిస్తాయి. కాకపోతే, ఆ బరువు ఎంతోసేపు ఉండదు. దాంతో సినిమాకి జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది.
సినిమా చాలా స్లోగా బోరింగ్ గా సాగుతూ.. ఎక్కడ టర్నింగ్ పాయింట్ కూడా లేకుండా.. సింగిల్ ప్లాట్ తోనే సినిమా మొత్తం సాగడం.. మొత్తమ్మీద ఈ సినిమా ఎవరికీ కనెక్ట్ కాదు. అసలు ప్రతి పాత్ర ఒకే ఎమోషన్ తో సినిమా చివరి వరకు ఉంటే ఎలా నచ్చుతుంది ? బలమైన సంఘర్షణతో సాగాల్సిన పాత్రలు నిస్సహాయతతో సాగితే ఆ పాత్రలు ఎప్పటికీ ఎవరికీ కనెక్ట్ కావు.
ప్లస్ పాయింట్స్ :
మెయిన్ కథాంశం,
కొన్ని కామెడీ సీన్స్,
నేపథ్య సంగీతం,
మైనస్ పాయింట్స్ :
బోరింగ్ ప్లే,
రొటీన్ డ్రామా,
లాజిక్స్ మిస్ అవ్వడం,
స్లో సాగే ట్రీట్మెంట్,
ఇంట్రెస్ట్ లేని సీన్స్,
సినిమా చూడాలా ? వద్దా ?
డిఫరెంట్ సినిమాలు ఇష్టపడే వారు ఒకసారి చూడొచ్చు. ఇక మిగిలిన ప్రేక్షకులకు ఈ సినిమా అసలు కనెక్ట్ కాదు. కాబట్టి, ఈ సినిమా చూడక్కర్లేదు.
Also Read: Kamal Haasan Sridevi: శ్రీదేవిని కమల్ హాసన్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనా..?