Skanda 4 Days Collections: స్కంద 4 డేస్ కలెక్షన్స్…. ఆదివారం జోరు! ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే!

రెండో రోజు దారుణంగా వసూళ్లు పడిపోయాయి. 50 శాతానికి పైగా డ్రాప్ కనిపించింది. సెకండ్ డే స్కంద కేవలం రూ.3.50 కోట్ల షేర్ రాబట్టింది. మూడో రోజు నిలకడగా ఉన్నాయి. పెద్దగా డ్రాప్ కాలేదు.

Written By: Shiva, Updated On : October 2, 2023 5:59 pm
Follow us on

Skanda 4 Days Collections: మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన స్కంద చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ దక్కింది. రామ్ పోతినేని-శ్రీలీల జంటగా నటించగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించారు. ఫస్ట్ డే స్కంద తెలుగు రాష్ట్రాల్లో రూ.8.62 కోట్ల షేర్ రాబట్టింది. అయితే రెండో రోజు దారుణంగా వసూళ్లు పడిపోయాయి. 50 శాతానికి పైగా డ్రాప్ కనిపించింది. సెకండ్ డే స్కంద కేవలం రూ.3.50 కోట్ల షేర్ రాబట్టింది. మూడో రోజు నిలకడగా ఉన్నాయి. పెద్దగా డ్రాప్ కాలేదు.

థర్డ్ డే ఏపీ/తెలంగాణాలలో రూ.3.27 కోట్ల షేర్ రాబట్టింది. అనూహ్యంగా నాలుగో రోజు పుంజుకుంది. స్కంద వసూళ్లు పెరిగాయి. స్కందకు పోటీగా విడుదలైన చంద్రముఖి 2 యావరేజ్ టాక్ తెచ్చుకోగా, పెదకాపు 1 డిజాస్టర్ అయ్యింది. ఈ పరిణామం స్కందకు కలిసొచ్చింది. నాలుగవ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.4.46 కోట్ల వసూళ్లు అందుకుంది. మొత్తం 4 రోజుల వసూళ్లు పరిశీలిస్తే… ఏపీ/తెలంగాణాలలో రూ. 19.85 కోట్ల షేర్, రూ. 32.20 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

వరల్డ్ వైడ్ స్కంద రూ. 23.4 కోట్ల షేర్, రూ. 39.6 కోట్ల గ్రాస్ అందుకుంది. స్కంద వరల్డ్ వైడ్ రూ. 46 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే బ్రేక్ ఈవెన్ దాటి హిట్ స్టేటస్ అందుకోవాలంటే రూ. 47 కోట్లు రాబట్టాలి. మరో రూ. 23 కోట్లకు పైగా వసూళ్లు రాబడితే కానీ స్కంద హిట్ కాదు.

ట్రెండ్ చూస్తుంటే కష్టమే అనిపిస్తుంది. నేడు హాలిడే కాగా రేపటి నుండి స్కందకు అసలు పరీక్ష మొదలు కానుంది. మంగళవారం చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టిన నేపథ్యంలో స్కంద బ్రేక్ ఈవెన్ కి దగ్గరయ్యే అవకాశం ఉంది. స్కంద చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిత్తూరి నిర్మించారు. థమన్ సంగీతం అందించారు. థమన్ మ్యూజిక్ కి పూర్తిగా నెగిటివ్ మార్క్స్ పడ్డాయి. బీజీఎమ్ విషయంలో కూడా ఫెయిల్ అయ్యాడు.