Allu Arjun: ఒక సినిమాతో సక్సెస్ సాధిస్తే ఆ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి పేరు వస్తోంది. దర్శకుడికి అంతకు మించిన సినిమా చేసే అవకాశాలు వస్తాయి. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సైతం ‘పుష్ప 2’ సినిమాతో ఎవరు గ్రీన్ సక్సెస్ ను సాధించాడు. కాబట్టి అతని కోసం ఇండియా లో ఉన్న స్టార్ డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. కాబట్టే ఇండియాలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరు అతని కోసమే ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అట్లీతో సినిమా చేస్తున్న అల్లు అర్జున్ తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
సంజయ్ లీలా భన్సాలీ లాంటి దర్శకుడు సైతం అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…తమిళ్ సినిమా ఇండస్ట్రీలో లోకేష్ కనకరాజ్, నెల్సన్ సైతం అల్లు అర్జున్ కి కథలు వినిపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న సందీప్ రెడ్డి వంగ, శ్రీకాంత్ ఓదెల, ప్రశాంత్ నీల్ సైతం అల్లు అర్జున్ కోసమే కొన్ని కథలను ప్రిపేర్ చేస్తున్నారు.
ఇప్పటికే చాలా మంది డైరెక్టర్లు అతనితో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఆయన మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తే తప్ప అతను టాప్ పొజిషన్ కి వెళ్లడానికి అవకాశమైతే దక్కదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో తనను తాను ఎలివేట్ చేసుకోవాలంటే మాత్రం మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది…
ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఈ సినిమా 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ మూవీ 2500 కోట్ల వరకు ఒక కలెక్షన్స్ ను కొల్లగొడుతోందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా ఎవర్ గ్రీన్ సక్సెస్ గా నిలిస్తే మాత్రం అల్లు అర్జున్ క్రేజ్ తార స్థాయికి చేరుకుంటుంది…