Ram Charan And Sukumar: ఉప్పెన సినిమాతో పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు… ఇలాంటి ఒక కథతో కూడా సినిమా చేయొచ్చు అని నిరూపించాడు. ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. మొదటి సినిమాతోనే 100 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టిన ఆయన రెండో సినిమాని రామ్ చరణ్ తో చేసే అవకాశాన్ని అందుకున్నాడు. పెద్ది సినిమాతో తన పూర్తిస్థాయి టాలెంట్ ని బయటకు తీయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు బుచ్చిబాబుకి ఈ సినిమాతో రాబోతుందంటూ సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ చాలా వీక్ గా ఉందంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. అలాంటి క్లైమాక్స్ స్టార్ హీరో సినిమాకి ఉండాల్సినది కాదంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. సినిమా మొత్తం ఒకెత్తయితే క్లైమాక్స్ మాత్రం డల్ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
సుకుమార్ సైతం ఈ సినిమా కథ మీద కొన్ని రకాలుగా కసరత్తులు చేశాడు. అందువల్లే రామ్ చరణ్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ మాత్రం ఈ సినిమా మీద పూర్తిస్థాయి కాన్ఫిడెంట్ తో లేడని సుకుమార్ వల్లే ఈ సినిమా చేస్తున్నాడు అంటూ తన సన్నిహితుల నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
ఇక రామ్ చరణ్ ఈ విషయంలో ఎలా స్పందిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు స్టార్ హీరోలను డైరెక్షన్ చేయలేని బుచ్చిబాబు ఈ సినిమాతో రామ్ చరణ్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది. అలాగే రామ్ చరణ్ సైతం తనని తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. పాన్ ఇండియాలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వాళ్లలో రామ్ చరణ్ మొదటి స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ టైంలో అతను ఎక్స్పరిమెంట్లు చేయాల్సిన అవసరమైతే లేదు.
ఎందుకంటే ఒక్క ఫెల్యూయర్ వచ్చిన కూడా ఆయన చాలా వరకు వెనుకబడిపోవచ్చు. ఈ సంవత్సరం వచ్చిన గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ కొంతవరకు తగ్గింది. ఎందుకంటే ప్రేక్షకులందరు రామ్ చరణ్ మీద విమర్శలైతే చేశారు. ఇక ఇప్పుడు పెద్ది సినిమా విషయంలో ఆయన తప్పకుండా సక్సెస్ ను సాధించాల్సిన అవసరమైతే ఉంది…