
Varun Doctor Movie: కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ కు తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉంది. ‘రెమో’, ‘సీమ రాజా’, ‘శక్తి’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను బాగానే అలరించాడు శివ కార్తికేయన్. ఈ రోజు మరో సినిమా వరుణ్ డాక్టర్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా విజయదశమి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 9న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.
శివ కార్తికేయన్ జోడీగా క్రేజీ హోమ్లీ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందట. ఒక ఆర్మీ డాక్టర్ అయిన వరుణ్ కొన్ని కారణాల వలన, తన సొంత ఊరు వస్తాడు. అయితే, ఆ ఊరులో వరుణ్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు ? అసలు ఆ ఊరులో ఏం జరిగింది ? అప్పుడతను ఏం చేస్తాడు? అనేదే మెయిన్ కథ.
హీరోకి, విలన్ కి మధ్య నడిచే మైండ్ గేమ్ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట. సినిమా చూసిన ప్రేక్షకులు చాలా థ్రిల్ ఫీలవుతారట. మరి శివ కార్తికేయన్ కి ఈ సినిమాతో కూడా వస్తోందేమో చూడాలి. ఇక ఈ సినిమా గురించి హీరో శివ కార్తికేయన్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. సినిమా చూసినప్పుడు ఆడియన్స్ చాలా ఎగ్జైట్మెంట్ ఫీలవుతారు’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక ఈ సినిమాని తెలుగులో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా ? సినిమా అయితే, భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఓపెనింగ్స్ వస్తేనే రిలీజ్ డబ్బులు వస్తాయి. అయితే, సినిమా పై ఉన్న అంచనాలు చూస్తే.. ఓపెనింగ్స్ రావడం కష్టమే అనిపిస్తుంది.