Sitaare Zameen Par Day 1 Collection: ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరైన అమీర్ ఖాన్(Aamir Khan) గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ‘దంగల్’ తర్వాత ఈయన ‘సీక్రెట్ సూపర్ స్టార్’,’తగ్స్ ఆఫ్ హిందూస్తాన్’, ‘లాల్ సింగ్ చద్దా’ వంటి చిత్రాలు చేసాడు కానీ, అవన్నీ కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి. అమీర్ ఖాన్ కి ‘దంగల్’ వరకు రాజమౌళి కి ఉన్నటువంటి ఇమేజ్ ఉండేది. తన సినిమాలకు తానే పోటీ అనే విధంగా అమీర్ ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీ ని ఏలాడు. కానీ ఈ మూడు సినిమాలు ఫ్లాప్ అవ్వడం తో ఆయన తదుపరి చిత్రం చేయడానికి చాలా జాగ్రత్త పడ్డాడు. ఒకటికి పది సార్లు అలోచించి ‘సితారే జమీన్ పర్'(Sitare Zameen Par) వంటి సున్నితమైన సబ్జెక్టు ని ఎంచుకున్నాడు.
సాధారణంగా ఇలాంటి కథలు విడుదలకు ముందు జనాల్లో హైప్ క్రియేట్ చేయడం అసాధ్యం. అమీర్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ కి మాత్రమే కాదు, ఎంత పెద్ద సూపర్ స్టార్ కి అయినా ఇదే వర్తిస్తుంది. ‘సితారే జమీన్ పర్’ కి కూడా అదే జరిగింది. అసలు ఈ సినిమా విడుదల అవుతుంది అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. అంతటి తక్కువ ప్రొఫైల్ తో విడుదలైంది. మార్నింగ్ షోస్ , మ్యాట్నీ షోస్ బాగా దెబ్బ తిన్నాయి. కానీ ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ నుండి మాత్రం ఈ చిత్రం విశ్వరూపం చూపించేసింది. ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్ ఇలా ఒక్కటా రెండా అన్ని రాష్ట్రాల్లోనూ ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఫలితంగా ఈ చిత్రానికి మొదటి రోజు పది కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. అమీర్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ కి ఇది చాలా తక్కువ వసూళ్లే. కానీ ఆ సినిమా జానర్ ని బట్టి ఈ చిత్రానికి విడుదలకు ముందు కనీసం 5 కోట్లు అయినా వస్తుందా అనుకునేవాళ్లు.
Also Read: Aamir Khan : ముచ్చటగా మూడో పెళ్ళికి సిద్ధమైన అమీర్ ఖాన్…అమ్మాయి ఎవరో తెలుసా..?
కానీ అందరి అంచనాలను మించి ఈ చిత్రం మొదటి రోజు డబుల్ డిజిట్ వసూళ్లను అందుకుంది. ఇక రెండవ రోజు మొదటి రోజు కంటే అద్భుతమైన ట్రెండ్ తో మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమాకు బుక్ మై షో యాప్ లో గంటకు 25 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఇది సాధారణమైన విషయం కాదు. ఇదే రేంజ్ డీసెంట్ హోల్డ్ ని ఈ సినిమా కొనసాగిస్తూ వెళ్తే ఫుల్ రన్ లో కచ్చితంగా ఈ చిత్రం అద్భుతాలను నెలకొల్పే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ ట్రేడ్ పండితులు అంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఫుల్ రన్ లో 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ సినిమా రేంజ్ ఏంటి అనేది అర్థ అవుతుంది.