Sita Ramam First Review: చిత్రం రివ్యూ : సీతారామం
నటీనటులు: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా, సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, భూమికా చావ్లా, తరుణ్ భాస్కర్, శత్రు, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్
Also Read: Pokiri Movie Re- Release: మహేష్ బాబు డై హార్ట్ ఫ్యాన్స్ సంచలన నిర్ణయం.. ఇక మోత మోతే !
సంగీతం : విశాల్ చంద్రశేఖర్
చాయాగ్రహణం: పీఎస్ వినోద్, శ్రేయాస్ కృష్ణ
ఎడిటర్: కోటగిరి వేంకటేశ్వరరావు
నిర్మాతలు: స్వప్న సినిమాస్
సమర్పణ: వైజయంతీ మూవీస్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి
‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో దుల్కర్ సల్మాన్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత వచ్చిన సినిమాలను ఇక్కడి ప్రేక్షకులు ఆదరించారు. తాజాగా ఆయన ‘సీతారామం’ సినిమాతో అలరించబోతున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా లవ్ స్టోరీ సినిమాలు రావడం తగ్గాయి. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ‘లవ్ స్టోరీ’ పర్వాలేదనిపించింది. అయితే కాన్సెప్ట్ ప్రేమ కథే అయినా కొత్త కోణాన్ని ‘సీతా రామం’లో చూపించింది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కు జోడిగా మృణాల్ ఠాకూర్ నటించింది. వీరిద్దరి కెమిస్ట్రీ బాగా పండింది. అలాగే మరో స్టార్ హీరోయిన్ రష్మిక మందానా కీలక పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా ఆగస్టు 5న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఇప్పటికే పలువురు ప్రముఖుల కోసం ప్రివ్యూలు పడ్డాయి. దీంతో ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం..
‘సీతా రామం’ తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో ఒకే రోజు రిలీజవుతోంది. ఈ సినిమా గురించి ఇప్పటికే ట్రైలర్ ద్వారా మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేమకథల నేపథ్యంలో ఇప్పటికీ చాలా సినిమాలు వచ్చాయి. కానీ ‘సీతా రామం’ లవ్ స్టోరీ కొత్తగా ఉంది.. కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి ప్రచారం జోరుగా చేశారు. ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ్ కూడా ప్రమోషన్ కార్యక్రమంలో సపోర్టుగా నిలిచారు.
-కథ ఏంటంటే?
1965లో జరిగిన యుద్ధం నేపథ్యంలో జరిగిన లవ్ స్టోరీనే ఈ సినిమా ప్రధాన కథ. ఈ కథంతా రెండు కాలాల్లో నడుస్తుంది. ఓవైపు దుల్కర్ -మృణాల్ మధ్య అందమైన ప్రేమకథను చూపిస్తూనే.. మరోవైపు రష్మిక మందన్నా వారి జీవితం గురించి తెలుసుకునే ప్రయాణాన్ని సినిమాలో ఆసక్తికరంగా చూపించారు. దాని చుట్టు అల్లుకున్న బంధాలను ఎమోషనల్ గా చూపించారు. యుద్ధం పరిస్థితులు, ప్రేమ, మధ్యలో వేరొక బంధాల నేపథ్యంలో సినిమా సాగుతుంది. లవ్, రొమాన్స్ తో పాటు ఎమోషన్స్ కూడా బాగా పండించారు. ఇక దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. మరో స్టార్ హీరోయిన్ రష్మికా మందానా కీలక పాత్రలో నటించారు. ఇప్పటి వరకు హీరోయిన్ గా అలరించిని రష్మిక మొదటిసారి ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు.
-విశ్లేషణ
హను రాఘవపూడికి లవ్ స్టోరీని బాగా హ్యాండిల్ చేశాడు.. ఈ సినిమాపై ఆ రకంగా కూడా అంచనాలు పెరిగాయి. మరోవైపు సంగీత దర్శకుడు విశాల్ తన పాటలతో సినిమాను ఆకట్టుకునేలా చేశాడు. ఈ సినిమా పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో బ్యాక్రౌండ్ మ్యూజిక్ పై ఆశలు పెట్టుకున్నారు. మొత్తంగా తన మ్యూజిక్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మరోవైపు సినిమా కోసం అశ్వనీదత్ భారీగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ప్రొడకషన్ వాల్యూస్ రిచ్ గా ఉండడంతో బడ్జెట్ విషయంలో వెనుకాడలేదు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఏ విధంగా స్పందన వస్తుందో చూడాలి.
-తీర్పు:
ఈ అందమైన ప్రేమకథ హృదయాన్ని తట్టిలేపుతుంది. నటీనటుల అందమైన పర్ఫామెన్స్, అందమైన విజువల్స్, వినసొంపైన మ్యూజిక్ తో సినిమా ఎమోషనల్ జర్నీగా సాగుతుంది. సినిమా గురించిన పూర్తి రివ్యూ కోసం వేచిచూడండి..
Also Read:Pokiri Re- Release: ‘పోకిరీ’ మళ్లీ వస్తున్నాడు.. తెలుగు రాష్ట్రాల్లో మహేష్ మేనియా..!