Shanmukh Jaswant : షణ్ముఖ్ జస్వంత్.. ఈ పేరు పరిచయం అవసరం లేదు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించాడు. వెబ్ సిరీస్ లతో తన సత్తా చాటుతూ.. అందరి మదిలో నిలిచారు. కానీ ఇప్పుడు ఆయన మీద కొన్ని వివాదాలు రావడంతో అభిమానులు హట్ అవుతున్నారు. మంచి యూట్యూబర్ గా గుర్తింపు సంపాదించిన షణ్ముఖ్.. బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లాడు. ఈయన విన్నర్ గా నిలుస్తారు అనుకుంటే.. సిరి వల్ల ఆ ఛాన్స్ పోయింది అంటారు కొందరు.
సిరీతో క్లోజ్ గా మూవ్ అవడంతో వీరిద్దరిపై నెగిటివిటీ బాగా స్పెడ్ అయిందని.. దీంతో ఆయనకు దీప్తి సునయనకు కూడా బ్రేకప్ అయింది అనే టాక్ వచ్చింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా షణ్ముఖ్ ను పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. గంజాయి తీసుకుంటూ కనిపించిన షణ్ముఖ్ ను పోలీసులు పట్టుకున్నారని టాక్. ఆయన తన ఇంట్లో గంజాయి తీసుకుంటుండగా అరెస్ట్ చేశారట. ఈ విచారణలో భాగంగా తను డిప్రెషన్ లోకి వెళ్లారట.
అయితే డిప్రెషన్ వల్ల ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తుండడంతో గంజాయి తీసుకున్నాను అంటూ తెలిపారు షణ్ముఖ్. ఇదిలా ఉంటే ఈయన అరెస్ట్ పై సిరి హన్మంత్ స్పందించింది. తాజాగా ఈమె షణ్ముఖ్ అరెస్ట్ గురించి మాత్రమే కాదు బిగ్ బాస్ తర్వాత షణ్ముఖ్ ను కలవలేదు అంటూ తెలిపింది. తన పర్సనల్ లైఫ్ ఇలా అవుతుందని తాను అసలు ఊహించలేదని.. తనకు బ్రేకప్ జరిగిన తర్వాత కూడా తనను కలవడం కరెక్ట్ కాదని.. అందుకే షణ్ముఖ్ ను కలవలేదు అంటూ తెలిపింది సిరి.