
‘Sir’ Collections : ఈ సంక్రాంతికి విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ , ‘వీర సింహా రెడ్డి’ వంటి సూపర్ హిట్స్ తర్వాత వచ్చిన సినిమాలు కొన్ని బాక్స్ ఆఫీస్ పరంగా నిరాశపర్చాయి. అలాంటి సమయంలో తమిళ హీరో ధనుష్ తెలుగులో చేసిన డైరెక్ట్ చిత్రం ‘సార్’ విడుదలై సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకొని ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోసింగ్ వరకు దుమ్ము లేపేస్తోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి సూపర్ హిట్ స్టేటస్ ని అందుకొని లాభాల వర్షంలో మునిగితేలుతున్న ఈ సినిమా విడుదలై వారం రోజులు పూర్తి అయ్యింది.
ఈ వారం రోజుల్లో ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు.ఒక్క రజినీకాంత్ సినిమాలను మినహా, ఈ చిత్రం తమిళ హీరోల తెలుగు డబ్బింగ్ సినిమాల వసూళ్లను మొత్తం ఈ వీకెండ్ తో దాటేయబోతుంది. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రం తమిళం కంటే ముందుగా తెలుగులోనే బ్రేక్ ఈవెన్ మార్కును అందుకుందట.
తెలుగు మరియు తమిళం భాషలకు కలిపి ఈ సినిమా 35 కోట్ల రూపాయలకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయిందట. ఇందులో తెలుగు వెర్షన్ రైట్స్ దాదాపుగా ఆరు కోట్ల రూపాయిల వరకు ఉంటుంది. మిగిలిన 29 కోట్ల రూపాయిలు తమిళ వెర్షన్ కి సంబంధించిన రైట్స్. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. వారం రోజులకు తెలుగు వెర్షన్ లో వచ్చిన వసూళ్లు 13.25 కోట్ల రూపాయిల షేర్ అట. తెలుగు మరియు తమిళం వెర్షన్ కి కలిపి మొదటి వారం ప్రపంచవ్యాప్తంగా 33 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ 33 కోట్ల రూపాయలలో తెలుగు వెర్షన్ వసూళ్లను తీసేస్తే 19 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు కేవలం తమిళం నుండి వచ్చాయి.
అంటే తమిళ్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఇంకా 9 కోట్ల రూపాయిల అవసరం ఉందట.కానీ మొత్తం మీద బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఇంకో రెండు కోట్ల రూపాయిల అవసరం ఉంది. ఈ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయి సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకుంటుంది. కానీ, తమిళ వెర్షన్ బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో మెలుగుతున్న ప్రశ్న.