Sir Madam Movie Review: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న నటుడు విజయ్ సేతుపతి ఆయన చేసిన చాలా సినిమాల్లో గొప్ప గుర్తింపు సంపాదించి పెట్టడమే కాకుండా తన దగ్గర సత్తా చాటుకోవాలని ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఇలాంటి క్రమంలోనే విజయ్ సేతుపతి డిఫరెంట్ పాత్రలను చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటీ సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి సినిమాలు చేసిన కూడా విజయ్ సేతుపతి చేసిన సినిమాలతో గొప్ప గుర్తింపు ప్రతి సంపాదించి పెడుతున్నాయి ఎక్కువగా ఆయన క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు చేస్తూ ఉంటాడు అలాగే కథకి ఎక్కువ డిమాండ్ ఉన్న పాత్రలని ఎంచుకుంటూ ఉంటాడు ఇలాంటి సందర్భంలోనే నిత్యమీనన్ తో ఆయన చేసిన తలైవన్ తలైవి అనే సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది అయితే ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకులకు ఇప్పించిందా లేదా అన్న విషయం చూద్దాం…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే అగసవీరన్ (విజయ్ సేతుపతి) జాబ్ చేయడం ఇష్టంలేక కుటుంబంతో కలిసి పరోటాల బిజినెస్ చేస్తుంటాడు. ఇక ఆయన పరోటాలు చాలా ఫేమస్ గా ఉంటాయి. అందరు వాటిని తినడానికి ఆసక్తి చూపిస్తుంటాడు.ఇక హీరోయిన్ అరుసు (నిత్యమీనన్) సైతం పరోటాలు నచ్చి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఇక ఆగసవీరన్ అటు తన తల్లి మీద గౌరవం తో భర్త మీద ప్రేమ తో ఉంటాడు. కానీ అత్తకోడళ్ల మధ్య తరచుగా విబేధాలు వస్తుంటాయి. వాళ్ల మధ్య తను నలిగిపోతుంటాడు. ఇక ఈ క్రమంలోనే అరుదు వాళ్ల అన్నయ్య కి ఆగస వీరన్ కి మధ్య కొన్ని విబేధాలు వస్తాయి. దాని వల్ల వీళ్ళు ఎలా నలిగిపోయారు అనేదే ఈ సినిమా కథ…
Also Read: వార్ 2 ట్రైలర్ Jr NTR ఫాన్స్ ని ఇంప్రెస్ చేసిందా?
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాతో విజయ్ సేతుపతి ఒక హోటల్ అబ్బాయిల చాలా బాగా నటించాడు. అలాగే నిత్యమీనన్ కి తనకి జోడీ బాగా కుదిరింది…వీళ్ళ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులలో ఒక హై ఫీల్ ను కలిగిస్తాయి…ఇక ఈ ఇద్దరు ఒకరికి ఒకరు తీవ్రమైన పోటీ ని ఇస్తు చాలా బాగా నటించి మెప్పించే ప్రయత్నం అయితే చేశారు…అలాగే ఈ సినిమాను పాండిరాజ్ చాలా చక్కగా ఎక్కడ ఎలాంటి డివియేషన్స్ లేకుండా క్యారెక్టర్స్ ను చాలా బాగా తెరకెక్కించారు. విజయ్ సేతుపతి అయితే గతంలో ఎప్పుడూ ఇవ్వనటువంటి ఒక గొప్ప నటన ప్రతిభను కనబరిచారు…సినిమా స్టార్టింగ్ లో సీన్స్ పెద్దగా ఇంపాక్ట్ చూపించనప్పటికీ ఇంటర్వెల్ కి వచ్చే సరికి సినిమా కథలోకి ఎంటర్ అయి ఊపందుకుంటోంది. ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ డల్ అయ్యాయి. అయినప్పటికి సెకండాఫ్ మాత్రం చాలా ఫాస్ట్ గా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు…ఇక ఒక ట్విస్ట్ కూడా ఈ సినిమాకి అదనపు ఆకర్షణ గా నిలిచిందనే చెప్పాలి..
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయాని వస్తే విజయ్ సేతుపతి అదరగొట్టాడు…ఈ సినిమాతో ఆయనకి నేషనల్ అవార్డ్ పక్కగా వస్తుంది. అలాగే నిత్య మీనన్ కూడా చాలా మంచి పర్ఫామెన్స్ అయితే ఇచ్చింది. ఇక ఇప్పటి వరకు ఆమె చేసిన పాత్రాలన్నింటిలో ఒక రెబలిజం ఉంటుంది. ఈ సినిమాలో కూడా అదే ఉంది… మొత్తానికైతే వీళ్ళతో పాటు మిగిలిన ఆర్టిస్టులందరు చాలా చక్కటి పర్ఫామెన్స్ ఇచ్చారు.
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సంతోష్ నారాయణ్ చేసిన మ్యూజిక్ చాలా బాగుంది. ఆయన చేసిన సాంగ్స్ కానీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కానీ బాగా సెట్ అయింది. ఇక విజువల్స్ కూడా చాలా బాగా సెట్ అయింది. సినిమా ఎమోషన్స్ ను మిస్ చేయకుండా చాలా బాగా సెట్ చేశారు…మొత్తానికైతే ఈ సినిమా టెక్నికల్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి…ఇక ఎడిటింగ్ కూడా చాలా షార్ప్ గా చేశారు…
Also Read: పెళ్లి కాని శ్రీముఖి పరిస్థితి ఇదా… వీడియో వైరల్
ప్లస్ పాయింట్స్
కథ
ఎమోషనల్ సీన్స్
బ్యాగ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్
కొన్ని అనవసరమైన సీన్స్
సినిమా అంత ఒకే ప్లాట్ పాయింట్ తో ఉండటం…
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.75/5