Single: శ్రీ విష్ణు(Sree Vishnu) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సింగిల్'(#Single Movie) ఇటీవలే విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ‘స్వాగ్’ ఫ్లాప్ తర్వాత మళ్ళీ శ్రీ విష్ణు ఇప్పట్లో కోలుకుంటాడా లేదా అనే అనుమానం అందరిలో ఉండేది. కానీ ఈ సినిమాతో ఆయన కుంభస్థలం బద్దలు కొట్టాడు అనే చెప్పాలి. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు అద్భుతమైన కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉండడం వల్ల కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి వచ్చింది. అయితే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాని మన టాలీవుడ్ లో ఒక హీరో మిస్ చేసుకున్నాడట. ఆ హీరో ప్రస్తుతం వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్నాడు.
ఆయన మరెవరో కాదు, నితిన్(Nithin). డైరెక్టర్ కార్తీక్ రాజు ముందుగా ఈ స్టోరీ నితిన్ కి వినిపించాడట. ఫస్ట్ హాఫ్ వరకు విని, చాలా బాగుంది, కానీ ఇప్పుడు నేను కొన్ని సినిమాలకు కమిట్ అయ్యాను, అవి పూర్తి అయ్యే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది అని అన్నాడట నితిన్. డైరెక్టర్ అందుకు అంగీకరించి ఏడాది వరకు ఎదురు చూశాడట. నితిన్ నుండి ఎలాంటి కాల్ రాలేదు. దీంతో ఈ కథ ని బన్నీ వాసు కి వినిపించగా, ఆయనకు చాలా నచ్చింది. వెంటనే అల్లు అరవింద్ తో మాట్లాడి ఈ స్టోరీ ని గీత ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కించేందుకు ఒప్పందం చేసుకున్నారు. అలా మొదలైన ఈ సినిమా, ఇప్పుడు విడుదలై శ్రీవిష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే దిశగా అడుగులు వేస్తుంది. నితిన్ ఈ చిత్రాన్ని ఒప్పుకొని చేసుంటే భారీ కం బ్యాక్ ఇచ్చి ఉండేవాడు.
భీష్మ చిత్రం తర్వాత ఆయన చేసిన ప్రతీ సినిమా ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. రీసెంట్ గా విడుదలైన ‘రాబిన్ హుడ్’ చిత్రం ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇలాంటి సమయంలో మంచి కామెడీ టైమింగ్ ఉన్నటువంటి నితిన్ ఈ చిత్రాన్ని చేస్తే కచ్చితంగా ఇండస్ట్రీ ని షేక్ చేసి ఉండేవాడు. కానీ బ్యాడ్ లక్ కి మనోడంటే బాగా ఇష్టం. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఆయన వేణు శ్రీరామ్ తో చేసిన ‘తమ్ముడు’ అనే చిత్రం జులై 4 న విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా పైనే నితిన్ భారీ ఆశలు పెట్టుకున్నారు. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా తర్వాత ఆయన బలగం వేణు తో కలిసి ‘ఎల్లమ్మ’ అనే చిత్రం చేయబోతున్నాడు. ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.