Single Collection: యూత్ ఆడియన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోలలో ఒకరు శ్రీ విష్ణు(Sree Vishnu). ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ చిత్ర ‘సింగిల్'(#Single) నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలైంది. ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం ఆ రేంజ్ లో లేవు. అనేక ప్రాంతాల్లో ఓపెనింగ్స్ బిలో యావరేజ్ రేంజ్ లో ఉన్నాయి. నైజాం ప్రాంతం లో కాస్త పర్వాలేదు అనే రేంజ్ లో ఉన్నాయి కానీ, ఆంధ్ర ప్రాంతం లో మాత్రం నేడు ఈ చిత్రం దారుణమైన ఆక్యుపెన్సీలను నమోదు చేసుకుంది. చిన్న సినిమా కదా విడుదలకు ముందు పెద్దగా హైప్ కూడా లేదు, కాబట్టి ఓపెనింగ్స్ డల్ గా ఉండడం సహజమే అని అంతా అనుకున్నారు.
Also Read: ఇండియన్ ఆర్మీ కి అల్లు అరవింద్ భారీ విరాళం..సెల్యూట్ చేస్తున్న నెటిజెన్స్!
కానీ పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి మ్యాట్నీ షోస్ నుండి పికప్ అవుతుందని ట్రేడ్ పండితులు ఆశించారు. కానీ అది కూడా జరగలేదు. కనీసం ఫస్ట్ షోస్ నుండి అయినా ఊపు అందుకుంటుంది అనుకుంటే, నైజాం ప్రాంతం లో పర్వాలేదు అనే రేంజ్ లో పిక్ అయ్యింది కానీ, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం కలెక్షన్స్ లో ఎలాంటి పురోగతి కనపడలేదు. ఫలితంగా ఈ చిత్రానికి మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ నమోదు అవుతున్నాయి అని అనుకోవచ్చు. శ్రీ విష్ణు కి ప్రత్యేకమైన ఆడియన్స్ ఉన్నారు, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ఉంది, పైగా గీతా ఆర్ట్స్ లాంటి ప్రముఖ సంస్థ నుండి వస్తున్న సినిమా, విడుదలకు ముందు ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది, ఓపెనింగ్స్ కచ్చితంగా వస్తాయని ఆశించారు కానీ ఎందుకు రావడం లేదు అని సోషల్ మీడియా లో విశ్లేషణలు చేస్తున్నారు నెటిజెన్స్. దేశవ్యాప్తంగా ఇప్పుడు యుద్ధ మేఘాలు అలుముకున్నాయి కదా, దాని ప్రభావం కారణంగానే జనాలు బయపడి బయట తిరగడం లేదా?.
అందుకే ఈ సినిమాకు ఓపెనింగ్స్ లో దెబ్బ పడిందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు మూడు వేల టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. మార్నింగ్ షోస్ కంటే కాస్త బెటర్ అనే చెప్పాలి. రెండవ రోజు నుండి కలెక్షన్స్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఈ చిత్రం లో హీరోయిన్స్ గా కేతికా శర్మ, ఇవానా నటించిన సంగతి తెలిసిందే. కేతిక శర్మ ని హీరో ప్రేమిస్తాడు, హీరో ని ఇవానా ప్రేమిస్తుంది. ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ లో హీరో చివరికి ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అనేది ఆసక్తికరమైన స్టోరీ పాయింట్. యూత్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.