https://oktelugu.com/

Singer Sunitha : సింగర్ సునీత మొదటి భర్త ఎవరు? అతడి గురించి తెలుసా?

సునీత తొలి వివాహం గురించి అప్పట్లో సోషల్ మీడియాలో కొన్ని నిజాలు బయటికి వచ్చాయి. ఈమె మొదటి భర్త పేరు కిరణ్. ఆయన కూడా ఇండస్ట్రీలోనే ఉన్నాడు.

Written By:
  • admin
  • , Updated On : October 2, 2023 / 12:27 PM IST
    Follow us on

    Singer Sunitha : టాలీవుడ్ లో అందం అంతకన్నా అందమైన గాత్రం ఉన్న సింగర్ లో సునీత ఒకరు. ఎన్నో అద్భుతమైన పాటల పాడి శ్రోతలను అలరించారు సునీత. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా, సింగర్ గా తన ప్రతిభ చాటుకున్నారు సునీత. తన మధురమైన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు సునీత. ఇదిలా ఉంటే ఆమె రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సడన్ గా నెల రోజుల్లనే నిశ్చితార్థం, పెళ్లి రెండు కూడా జరిగిపోయాయి. ఈమె పెళ్లి చేసుకున్న వరుడు ఎవరో కాదు తన మనుసుకు నచ్చిన రామ్ వీరపనేనినే… అవును సింగర్ సునీత మొదటి భర్త ఎవరు? అతను ఏం చేసేవాడు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…

    సింగర్ గా ఎంతో మంది మదిలో మెదిలిన సింగర్ సునీత తన మనసుకు నచ్చిన రామ్ వీరపనేనితో ఏడడుగులు నడిచింది. శంషాబాద్ శివార్లలో ఉన్న రామాలయంలో 2011లో జనవరి 9న ఘనంగా జరిగింది. చాలా మంది ప్రముఖులు కూడా సునీత పెళ్లికి హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఈమె రెండో పెళ్లి గురించి.. రెండో భర్త గురించి అప్పట్లో సోషల్ మీడియాలో చాలా వార్తలు వినిపించాయి. కానీ మొదటి భర్త ఎవరు? ఏం చేస్తారు? ఎక్కడ ఉంటారు అనే వివరాలు ఏవి కూడా బయటకు రాలేదు. అయితే వీరి పెళ్లి ఓ నాటకీయంగా ఎవరు ఊహించని విధంగా జరిగింది. ఎందుకంటే సినిమా స్టైల్ లో ఏడడుగులు నడించింది సింగర్. మనుసులో ఉన్న మన్మథుడి కోసం ఇంట్లో వాళ్లను కాదని మరీ పెళ్లి చేసుకుంది. ఆ సమయంలో సింగర్ సునీత వయసు కేవలం 19 సంవత్సరాలు. కానీ ప్రేమ మాత్రం 17 సంవత్సరాలకే మొదలైందట.

    సునీత తొలి వివాహం గురించి అప్పట్లో సోషల్ మీడియాలో కొన్ని నిజాలు బయటికి వచ్చాయి. ఈమె మొదటి భర్త పేరు కిరణ్. ఆయన కూడా ఇండస్ట్రీలోనే ఉన్నాడు. సునీత గాయనిగా పరిచయం అయిన తర్వాత ఆమెకు ఇక్కడ కూడా చాలా మంది అభిమానులు వచ్చారు. ఇదిలా ఉంటే ఈమెకు 17 ఏళ్ళున్నపుడే కిరణ్ ఐ లవ్ యూ చెప్పాడు. అయితే వెంటనే ఆమె ఒప్పుకోలేదు. దాదాపు ఏడాదిన్నర తిరిగిన తర్వాత ఓకే చెప్పింది. కానీ అప్పటికి కూడా ఆమె వయసు కేవలం 19 ఏళ్ళు మాత్రమే.

    Sunitha-Upadrashta-with-her-husb

    పైగా సునీత ప్రేమించిన వాడు ఈమె ఇంట్లో నచ్చలేదు కూడా. అయినా కూడా ప్రేమించిన తన కోసం ఇంటి నుంచి వెళ్లిపోయింది సునీత. బయటికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. 19 ఏళ్ళ ప్రాయం అంటే కెరీర్ అప్పుడప్పుడే సెట్ చేసుకోవాల్సిన టైమ్. కానీ ఈమె మాత్రం పెళ్లి చేసుకుంది. అయితే తను ప్రేమించింది కూడా తన సామాజిక వర్గానికి చెందిన అబ్బాయినే కావడంతో కొన్ని రోజుల తర్వాత ఇంట్లో వాళ్లు కూడా ఓకే అన్నారని చెప్పింది సునీత. కొన్ని రోజుల వరకు మాత్రం మాట్లాడలేదన్నారు. ఆ తర్వాత అన్నీ సర్దుకున్నాయని చెప్పుకొచ్చింది. కానీ ఆ తర్వాత అనుకోని అభిప్రాయ బేధాల కారణంగా విడిపోయామని తెలిపింది సునీత.

    అయితే ఇప్పుడు మాత్రం పిల్లలు మాత్రమే జ్ఞాపకాలు అంటూ.. ఏ పేరెంట్స్ కు అయినా వాళ్లే కదా లోకం అంటూ పిల్లలను తలుచుకుంది. అంతేకాదు గతం గురించి ఏమంటారు? ఎప్పుడైనా తలుచుకుంటారా అనే ప్రశ్నకు తన మనుసులో ఉన్న మాట బయటపెట్టింది. గతం గురించి తలుచుకొని బాధ పడేకంటే ఆ అనుభవాలు జీవితంలో పనికొచ్చేలా చేసుకుంటే చాలు అని సమాధానం ఇచ్చింది సింగర్. అంతేకాదు ఆ అనుభవాలు గుణపాఠాలు అవ్వాలి. అనుభవం భవిష్యత్తు కోసం పని చేయాలి అనే విధంగా మాట్లాడింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మొదటి భర్త వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు ఇలా విడిపోవడంతో ప్రేమపై నమ్మకం పోతుంది అంటున్నారు అభిమానులు.