Homeఎంటర్టైన్మెంట్Singer Sreerama Chandra: సైకో లవర్స్ ఉంటారు, వదిలించుకోవడం కష్టం.... లవ్ బ్రేకప్ పై సింగర్...

Singer Sreerama Chandra: సైకో లవర్స్ ఉంటారు, వదిలించుకోవడం కష్టం…. లవ్ బ్రేకప్ పై సింగర్ శ్రీరామచంద్ర షాకింగ్ కామెంట్స్

Singer Sreerama Chandra: బిగ్ బాస్ ఫేమ్ సింగర్ శ్రీరామచంద్ర తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో పాటలు పాడి మ్యూజిక్ లవర్స్ ని ఫిదా చేశాడు. డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా యూత్ లో శ్రీరామచంద్ర కి విపరీతమైన క్రేజ్ ఉంది. బిగ్ బాస్ తర్వాత ఆ క్రేజ్ మరింత పెరిగింది. హౌస్ లో ఉన్నప్పుడు హమీద తో లవ్ ట్రాక్ కూడా నడిపాడు. కాగా శ్రీరామచంద్ర రియల్ లైఫ్ లో కూడా చాలా ప్రేమ కథలు నడిపాడట.

లేటెస్ట్ ఇంటర్వ్యూలో శ్రీరామచంద్ర స్వయంగా తన బ్రేకప్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతని వయస్సు 38 ఏళ్ళు. అయినప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. పైగా నేను సింగిల్ గా ఉన్నాను. ఎవరైనా ట్రై చేసుకోవచ్చు అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. అయితే 9వ తరగతిలోనే ఓ అమ్మాయిని లవ్ చేశానని శ్రీరామ చంద్ర తన ఫస్ట్ లవ్ గుర్తు చేసుకున్నాడు. అనంతరం తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి చెప్పాడు.

అయితే తనకు సెట్ అయ్యే అమ్మాయి ఇంకా దొరకలేదని .. కొంతమంది దొరికారు కానీ ఎవరు వర్కౌట్ కాలేదని శ్రీరామచంద్ర తెలిపాడు. ఒకప్పుడు రిలేషన్ షిప్ లో ఉండేవాడిని ఇప్పుడు బ్రేకప్ అయిందని అన్నారు. దెబ్బ గట్టిగానే తగిలిందని .. బ్రేకప్స్ తాలూకు నొప్పులు, దెబ్బలు చాలానే ఉన్నాయి అని శ్రీరామ చంద్ర అన్నారు. అతను మాట్లాడుతూ .. వర్కౌట్ అవకపోతే బ్రేకప్ అయిపోవడమే మంచిది. నాకు గొడవ పడటం, తిట్టుకోవడం నచ్చదు.

నీతో మాట్లాడటం కుదరదు అని అక్కడ నుంచి వెళ్ళిపోతాను. కొన్నాళ్ళు ఫోన్ కూడా లిఫ్ట్ చేయను. కొంతమందితో బ్రేకప్ ఈజీగానే అవుతుంది. మరికొంతమంది మాత్రం జిడ్డులా వదలరు. రామ్ గోపాల్ వర్మ సినిమాలో ఊర్మిళ లాగా సైకో లవర్స్ ఉంటారు. అలాంటి వారిని సులభంగా వదిలించుకునే మార్గం దొరికితే బాగుండు అనిపిస్తుంది. ప్రస్తుతం అలాంటి సైకో లవర్ కి దూరంగా ఉంటూ తప్పించుకున్నానని చెప్పుకొచ్చాడు. రీతూ చౌదరి హోస్ట్ చేస్తున్న దావత్ షోలో పాల్గొన్న శ్రీరామచంద్ర ఇలా తన బ్రేకప్ స్టోరీలు బయటపెట్టాడు.

RELATED ARTICLES

Most Popular