Homeఎంటర్టైన్మెంట్Shweta Mohan: ఆ హీరోని పిచ్చగా ప్రేమిస్తున్నా... ఓపెన్ గా చెప్పేసిన స్టార్ సింగర్ శ్వేత...

Shweta Mohan: ఆ హీరోని పిచ్చగా ప్రేమిస్తున్నా… ఓపెన్ గా చెప్పేసిన స్టార్ సింగర్ శ్వేత మోహన్!

Shweta Mohan: టాలీవుడ్ స్టార్ సింగర్స్ లో శ్వేతా మోహన్ ఒకరు. తన అద్భుతమైన గాత్రంతో లక్షలాది మంది మనసు గెలుచుకుంది. ఆమెకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సార్ సినిమాలో ‘మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు ‘ పాటతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇటీవల ముగిసిన సూపర్ సింగర్ రియాలిటీ షో లో జడ్జ్ గా వ్యవహరించింది. సదరు షోకు శ్వేత మోహన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాగా శ్వేత మోహన్ వయసు 38 ఏళ్లు. ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ముద్దుగుమ్మ తాను ఓ స్టార్ హీరో ప్రేమలో ఉన్నట్లు తెలిపి షాక్ ఇచ్చింది. అతనంటే పిచ్చి ప్రేమ అని తెలిపింది. శ్వేత మోహన్ పదో తరగతి చదువుతున్నప్పటి నుంచే హీరో మాధవన్ ని ఇష్టపడుతుందట. అతనంటే పిచ్చి ప్రేమని వివరించింది. మాధవన్ తన ఫస్ట్ క్రష్ అని తెలిపింది. అతనికి పెద్ద ఫ్యాన్ అని, ఆయనే నా గుండె అని చెప్పింది. ఇప్పటికీ హీరో మాధవన్ అంటే పిచ్చి ప్రేమని తెలిపింది.

కానీ ఇప్పటివరకు కలిసే అవకాశం రాలేదని అసహనం వ్యక్తం చేసింది. అమితాబ్ బచ్చన్ వంటి పెద్ద స్టార్స్ ని కలిసాను. కానీ మాధవన్ కలవలేక పోయాను. ఇంత పెద్ద సింగర్ అయివుండి కూడా అతన్ని కలిసే ఛాన్స్ దొరకలేదు అని అన్నారు. కానీ జీవితంలో ఒక్కసారైనా ఆయనను కలుస్తానని, తాను స్కూల్ డేస్ నుంచి ఆయనను ఆరాధిస్తున్న విషయం చెబుతాను అని శ్వేత మోహన్ వెల్లడించారు.

శ్వేత మోహన్ ఉత్తమ నేపథ్య గాయని గా 4 ఫిల్మ్ ఫేర్ అవార్డులు సొంతం చేసుకుంది. కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం, అలాగే తమిళ్ నాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారంచే ఆమె గౌరవించబడింది. తెలుగు తో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అనేక పాటలు పాడింది. దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. కెరీర్ లో దూసుకుపోతుంది.

RELATED ARTICLES

Most Popular