Palash Muchhal: ప్రముఖ సింగర్ పలాశ్ ముచ్చల్.. ఇటీవల ఈయనపై చీటింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తప్పుడు ప్రచారమని మొదల మౌనంగా ఉన్నారు. కానీ రోజు రోజుకూ ప్రచారం పెరగడంతో స్పందించాడు. ఛీటింగ్ ఆరోపణలను కొట్టిపారేశాడు కోర్టును ఆశ్రయించాడు. రూ.40 లక్షలు మోసం చేశారని, అమ్మాయితో అనుచితంగా దొరికారనే కారణాలతో విజ్ఞాన్ మానేపై రూ.10 కోట్ల పరువు దావా వేశారు. ఈ వివాదం సెలబ్రిటీల ప్రైవసీ, లీగల్ యుద్ధాలకు దారితీసింది.
ఆరోపణల వివరాలు
విజ్ఞాన్ మానే పలాశ్‌ను మోసగాడిగా చిత్రీకరించి, ఆర్థిక లాభాలు పొందాలనుకుంటున్నారని ముచ్చల్ ఆరోపించాడు. రూ.40 లక్షలు తీసుకుని మోసం చేశారని, వ్యక్తిగత జీవితంలో అనైతిక చర్యలు చేశారనే ఆరోపణలు తన ఇమేజ్‌ను దెబ్బతీశాయని అతను చెప్పాడు. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కోర్టులో వాదించాడు.
పలాశ్ స్పందన
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పలాశ్ తన పరువు, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని స్పష్టం చేశాడు. తప్పుడు వాదనలతో తన కెరీర్‌ను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించాడు. తన న్యాయవాది ద్వారా విజ్ఞాన్ మానేకు చట్టపరమైన గోతా పంపానని పేర్కొన్నాడు. ఈ చర్యలు వేగంగా ముందుకు సాగుతున్నాయి.
ఈ కేసు సోషల్ మీడియా ఆరోపణలు సెలబ్రిటీలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియజేస్తుంది. తప్పుడు వ్యాఖ్యలు పరువు దావాలకు దారితీస్తాయి, కానీ న్యాయస్థానాలు సత్యాన్ని నిర్ధారించాల్సిన బాధ్యత వహిస్తాయి. పలాశ్ విజయం సాధిస్తే, భవిష్యత్తులో ఇలాంటి ఆరోపణలు తగ్గే అవకాశం ఉంది.