Prabhas: ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ప్రభాస్(Rebel Star Prabhas) ‘రాజా సాబ్'(The Rajasaab) చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. కల్కి లాంటి వెయ్యి కోట్ల గ్రాస్ సినిమా తర్వాత ప్రభాస్ నుండి కచ్చితంగా కనీస స్థాయి కంటెంట్ ఉన్న సినిమాలను కోరుకుంటారు అభిమానులు. అందులో ఎలాంటి తప్పు లేదు. విడుదలకు ముందు ఈ సినిమాపై అభిమానుల్లో పెద్దగా అంచనాలు లేవు కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ మరియు రిలీజ్ ట్రైలర్ తర్వాత అంచనాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో డల్ గా ఉన్నటువంటి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఊపందుకున్నాయి. అలా మంచి అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ప్రీమియర్ షోస్ నుండే అభిమానుల నుండి ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. 200 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం, వంద కోట్లకు పైగా నష్టాలను చూసింది.
ఇదంతా పక్కన పెడితే, ఇలాంటి సమయాల్లో హీరోలు అజ్ఞాతం లోకి వెళ్ళిపోతారు. అందుబాటులో ఉంటే ఎక్కడ నిర్మాతలు రెమ్యూనరేషన్ లో కొంత భాగం తిరిగి ఇవ్వమని అడుగుతారో అనే భయం తో, అసలు ఎవరికీ కొన్ని రోజులు కనపడకుండా పోతారు. కానీ ‘రాజా సాబ్’ కి ప్రభాస్ అలా చెయ్యలేదు. తనతో పాటు మూడున్నర సంవత్సరాలు కష్టపడి పని చేసిన స్టాఫ్ కష్టాన్ని గుర్తించాడు. అందుకే టెక్నీకల్ స్టాఫ్ కి 20000 రూపాయిలు, అదే విధంగా గ్రౌండ్ స్టాఫ్ కి 10000 రూపాయిలు ఇచ్చాడు ప్రభాస్. అంతే కాకుండా నిర్మాత నుండి తనకు రావాల్సిన డబ్బులు కూడా రిటర్న్ అడగలేదు ప్రభాస్. నష్టాలు వచ్చాయి కదా, అడ్వాన్స్ చాలు, మిగిలింది మీ దగ్గరే ఉంచండి, కుదిరిరే భారీ నష్టాలు వచ్చిన బయ్యర్స్ కి ఆ డబ్బులు ఇవ్వండి అంటూ చెప్పుకొచ్చాడట ప్రభాస్. ఇంతటి బంగారం లాంటి మనసు ఎంతమంది హీరోలకు ఉంటుంది చెప్పండి. డబ్బులు ఇవ్వకపోతే డబ్బింగ్ కూడా చెప్పము అంటూ మొండికేసే స్టార్ హీరోలు ఉన్న ఈ కాలం లో, ఇండియా లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయ్యుండి, ఇలా అందరి గురించి ఆలోచించే మనసు ప్రభాస్ లాంటోళ్లకు తప్ప ఎవరికీ ఉండదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.