Singer Mangli Investment Fraud Case: ఈమధ్య కాలం లో పాపులర్ సింగర్ మంగ్లీ(Singer Mangli) వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. హిందీ లో ఒక బూతు పాట పాడి, కేసులు వేయించుకొని , క్షమాపణలు చెప్పే పరిస్థితి కి దిగజారిన మంగ్లీ, ఇప్పుడు పెట్టుబడుల పేరుతో జనాలను మోసం చేస్తోంది అనే సంచలన ఆరోపణలతో మరో కేసు ని కూడా ఎదురుకుంటోంది. హైదరాబాద్ లో రీసెంట్ గానే ఈమె పై 100 కోట్ల పెట్టుబడి మోసం కేసు నమోదైంది. ప్రముఖ న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు ప్రకారం , సింగర్ మంగ్లీ ఇప్పటి వరకు 100 నుండి 150 మంది అమాయకులను అధిక లాభాల పేరుతో రియల్ ఎస్టేట్ , బిజినెస్ , ట్రేడింగ్ పేర్లతో పెట్టుబడులు పెట్టించి మోసం చేసిందని చెప్పుకొచ్చాడు. దాదాపుగా 100 నుండి 150 కోట్ల రూపాయిల వరకు ఆమె దోచుకుందని ఆరోపణలు చేశాడు.
బాధితులు కూడా రీసెంట్ గానే తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఇదేంటి అని ప్రశ్నించిన న్యాయవాదిని కూడా సింగర్ మంగ్లీ, ఆమె అనుచరులు బెదిరించారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన ఈ కేసు పై విచారణ జరుగుతుండగా, మరో వైపు మంగ్లీ ఈ కేసు పై స్పందించింది. నాకు ఈ స్కామ్ తో ఎలాంటి సంబంధం లేదని , కావాలనే నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని , దీనిపై నేను న్యాయపరమైన పోరాటం చేస్తానని చెప్పుకొచ్చింది మంగ్లీ. మరి నిజంగానే సింగర్ మంగ్లీ మోసం చేసిందా ?, లేదంటే ఈమెని కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా అనేది న్యాయ స్థానమే తేల్చి చెప్పాలి. అప్పటి వరకు సింగర్ మంగ్లీ ఈ ఆరోపణలు ఎదురుకోక తప్పదు. మరోవైపు మంగ్లీ కి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కెరీర్ లో పీక్ స్థాయిని ఎంజాయ్ చేస్తున్న మంగ్లీ , ఇలా వరుసగా వివాదాల్లో చిక్కుకోవడం ఆమె కెరీర్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ కేసు ఎన్ని మలుపులు తిరగబోతుంది అనేది.