Singer Kalpana : ప్రముఖ సింగర్ కల్పన(Singer Kalpana) నిన్న రాత్రి మల్కాజ్ గిరి లోని తన నివాసం లో అఘాయిత్యం చేసుకుంది అనే వార్త మీడియాలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రెండు రోజుల నుండి అపార్ట్మెంట్స్ లోని తన ఫ్లాట్ నుండి బయటకి రాకుండా ఉండడం తో, ఆమె బంధువులు, అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వెంటనే అక్కడికి చేరుకొని, ఆమెని అప్పటికప్పుడు హాస్పిటల్ కి తరలించారు. ఆమెకు పలు పరీక్షలు చేసి, చికిత్స చేసిన డాక్టర్లు, నిద్ర మాత్రలు మింగడం వల్ల ఆమె అపస్మారక స్థితికి వెళ్లిందని చెప్పుకొచ్చారు. ఎట్టకేలకు ప్రాణాపాయం నుండి బయటపడిన కల్పన కాసేపటి క్రితమే స్పృహలోకి వచ్చింది. స్పృహలోకి వచ్చిన తర్వాత ఆమె మాట్లాడిన మాటలు మీడియా లో సెన్సేషనల్ గా మారింది. తన కూతురు తన వద్దకు రాకపోవడం వల్ల చనిపోవాలని అనుకున్నాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
Also Read : కూతురు వల్లే సింగర్ కల్పన చనిపోవాలని అనుకుందా..? స్పృహలోకి వచ్చిన తర్వాత సంచలన నిజాలు బయటపెట్టిన కల్పన!
చాలా కాలం నుండి తన కూతురు కేరళ లో ఉందని, చదువుకోవడానికి హైదరాబాద్ కి రమ్మని కోరగా, ఆమె రాకపోవడంతోనే మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. దీనిపై ఆమె కూతురు దయ ప్రసాద్ కాసేపటి క్రితమే రెస్పాన్స్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘మా అమ్మగారు సింగర్ వృత్తిలో కొనసాగుతూనే, మరోపక్క PHD , LLB చేస్తుంది. దీని కారణంగానే ఆమె తీవ్రమైన ఒత్తిడి కి గురైంది. డాక్టర్లు ఆమెకు ఇన్సోమ్నియా టాబ్లెట్స్ ని వాడమని సూచించారు. ఒత్తిడి ఎక్కువైనా సమయంలో అమ్మ కాస్త ఎక్కువ టాబ్లెట్స్ తీసుకుంది. ఓవర్ డోస్ కారణంగా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. అంతే తప్ప మీడియా లో వస్తున్నన్నట్టు ఆమె ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడలేదు. దయచేసి మీడియా మిత్రులు అవసత్వాలు రాయకండి. మా కుటుంబం లో ఎలాంటి విబేధాలు లేవు. మేమంతా ఎంతో సంతోషంగా ఉంటున్నాము అంటూ వేడుకుంది. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. త్వరలోనే డిశ్చార్జ్ చేస్తారు’ అంటూ దయ ప్రసాద్ చెప్పుకొచ్చింది.
కూతురు చూస్తే ఇలా మాట్లాడుతుంది, కానీ తల్లి ఏమో మరో విధంగా మాట్లాడింది. రెండిట్లో ఏది నిజం, ఏది అబద్దం అనేది అభిమానులకు అర్థం కావడం లేదు. అయితే కూతురు దయ ప్రసాద్ మాట్లాడినట్టు వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి,కానీ కల్పన అలా మాట్లాడినట్టు మాత్రం ఎలాంటి వీడియో ప్రూఫ్స్ లేవు, కేవలం మీడియాకి ఒక సమాచారం వచ్చిందంతే. ఆమె పూర్తిగా కోలుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవరకు వాస్తవాలు బయటపడే పరిస్థితులు లేవని కొందరు చెప్తున్నారు.
Also Read : సింగర్ కల్పనా కి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది.. ఆమె బతుకంతా విషాదం!
