Singer Chinmayi Sripada: సంచలన కామెంట్స్ కి సింగర్ చిన్మయి శ్రీపాద కేర్ ఆఫ్ అడ్రస్. ఆమె కరుడుగట్టిన స్త్రీవాది. కెరీర్ కూడా పణంగా పెట్టి మీటూ ఉద్యమం చేశారు. తమిళ రచయిత వైరముత్తు మీద ఆమె అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అతడు అనేక మంది అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురి చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. వైరముత్తుపై ఆమె చేసిన ఆరోపణలు ఇండియా వైడ్ న్యూస్ అయ్యాయి. వైరముత్తుతో పాటు పలువురి మీద చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.
ఇక స్త్రీల గౌరవానికి, స్వేచ్ఛకు భంగం కలిగించే ప్రతి విషయాన్ని ఆమె ప్రశ్నిస్తారు. తాజాగా ఇద్దరు వ్యక్తులు స్త్రీల వస్త్రధారణ మీద కామెంట్స్ చేశారు. వీడియోలో అమ్మాయిలు కనీసం చున్నీ కూడా వేసుకోవడం లేదు. తమ ఎద భాగాన్ని కప్పుకోవడం లేదు. కొందరు పేరుకు చున్నీ వేసుకున్నప్పటికీ దాన్ని ఎద భాగాన్ని దాచడానికి ఉపయోగించడం లేదంటూ వీడియో చేశారు.
దీన్ని చిన్మయి తప్పుబట్టారు. అసలు అమ్మాయిలు జాకెట్ వేసుకోవడం మన సంస్కృతి కాదని ఆమె వెల్లడించారు. భారతీయ సంస్కృతి తెలియనివారు ఈ కామెంట్స్ చేస్తున్నారని అన్నారు. బ్రిటీషువారు రాకముందు మహిళలు జాకెట్ ధరించేవారు కాదు. కేవలం చీర కొంగుతో ఎద భాగాన్ని దాచుకునేవారు. జాకెట్స్ లేకుండా ఉన్న మహిళలను చూసి బ్రిటీష్ వారు షాక్ అయ్యారు. వారు జాకెట్ వేసుకోవడాన్ని ఇంట్రడ్యూస్ చేశారు.
అప్పట్లో మహిళలు బహిరంగంగా పిల్లలకు పాలు పట్టేవారు. ఆడవారి అర్థ నగ్న శరీరాన్ని ఇండియన్స్ శృంగార కాంక్ష రగిలించేదిగా చూడలేదని చిన్మయి చెప్పుకొచ్చారు. కాబట్టి ఆడవాళ్ళు తమ బట్టలతో భారతీయ సంస్కృతిని పాడు చేస్తున్నారని నమ్మేవాళ్ళు ఈ విషయం గుర్తించాలి… అంటూ ఆమె ఫైర్ అయ్యారు. చిన్మయి వీడియో వైరల్ అవుతుంది. గతంలో కూడా అమ్మాయిల యోని బిగుతుగా ఉండాలి, కలయిక తర్వాత రక్తస్రావం కావాలి, అప్పుడే ఆమె కన్య అని భావించడం సరికాదని చిన్మయి బోల్డ్ కామెంట్స్ చేశారు.