Simhadri Movie Re-Release: ఈమధ్య టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోల కెరీర్ లో సూపర్ హిట్ మరియు ఇండస్ట్రీ హిట్ చిత్రాలను పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేస్తూ అభిమానులు ఎంజాయ్ చేస్తుంటారు. అలా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి కానీ, ఖుషి , పోకిరి మరియు జల్సా సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ పరంగా సెన్సేషన్ సృష్టించాయి.
ముఖ్యంగా ఖుషి మరియు జల్సా సినిమాల మొదటి రోజు కలెక్షన్స్ ని ఇప్పుడొస్తున్న సినిమాలు ఫుల్ రన్ లో కూడా అందుకోలేకపోతున్నాయి. అయితే ఈ రికార్డ్స్ అన్నిటినీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సింహాద్రి చిత్రం బ్రేక్ చేస్తుందని నందమూరి అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. మే 20 వ తారీఖున ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల కాబోతున్న ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే పలు ప్రాంతాలలో ప్రారంభం అయ్యాయి.
వైజాగ్ , రాజమండ్రి వంటి ప్రాంతాలలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా, వైజాగ్ లో ఆశాజనకంగా మాత్రం బుకింగ్స్ లేవని తెలుస్తుంది. సిటీ లో ఉన్న థియేటర్స్ మొత్తం ఉదయం 8 గంటల ఆటలకు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు.అయితే కనీసం పది టికెట్స్ కూడా అమ్ముడుకాకపోవడం తో షోస్ మొత్తం క్యాన్సిల్ చేసి కేవలం ఒకే ఒక్క షో ని ఉంచారు, అది కూడా ఇప్పటి వరకు హౌస్ ఫుల్ కాలేదు. పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రానికి కొత్త సినిమా రిలీజ్ అయితే ఎలాంటి బుకింగ్స్ ఉంటాయో, ఆ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఉండేవి. దాంతో పోలిస్తే సింహాద్రి చాలా తక్కువ అనే చెప్పాలి.
ఇక ఆస్ట్రేలియా లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ చాలా డల్ గా ఉన్నాయి,కానీ అమెరికా లో మాత్రం ఇప్పటి వరకు నాలుగు వేల దూల్లరకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయని టాక్, ఇక్కడ మాత్రం అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నాయట, కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈ చిత్రం ఖుషి రికార్డ్స్ ని బద్దలు కొట్టడం అసాధ్యం అని అంటున్నారు ట్రేడ్ పండితులు, చూడాలి మరి.