SIIMA Awards 2023: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్(SIIMA) వేడుక దుబాయ్ వేదికగా ఘనంగా జరుగుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమలకు చెందిన నటీ నటులు హాజరయ్యారు. ఈ నెల 15, 16 తేదీ లో జరుగుతున్న ఈ కార్యక్రమం పై భారీ అంచనాలే ఉన్నాయి. దానిని తగ్గట్లే చాలా గ్రాండ్ గా ఈ ఈవెంట్ జరుగుతుంది. ఇక సైమా తెలుగు అవార్డ్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్ కి బెస్ట్ యాక్టర్ ( RRR ) వచ్చింది . RRR సినిమా కు ఏకంగా ఐదు అవార్డ్స్ వచ్చాయి . సీతారామం సినిమా కు బెస్ట్ హీరోయిన్ తో పాటు మరో రెండు అవార్డ్స్ వచ్చాయి.
ఉత్తమ నటుడు కేటగిరీలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్(ఆర్ ఆర్ ఆర్), సిద్దు జొన్నలగడ్డ(డీజే టిల్లు), దుల్కర్ సల్మాన్ ( సీతారామం), అడివి శేష్ (మేజర్) పోటీపడ్డారు. అయితే కొమరం భీమ్ పాత్రలో అద్భుత నటన కనబరిచిన ఎన్టీఆర్ కి ఈ అవార్డు దక్కింది.
ఈ సమయంలో ఎన్టీఆర్ మాట్లాడిన స్పీచ్ ఆకట్టుకుంది. ” నా ఒడిదుడుకుల్లో , నేను కిందపడినప్పుడు నన్ను పట్టుకుని పైకి లేపినందుకు , నా కళ్ళ వెంట వచ్చిన ప్రతి నీటి చుక్క కి వాళ్ళు కూడా బాధ పడినందుకు , నేను నవ్వినప్పుడు నాతో పాటు వాళ్ళు కూడా నవ్వినందుకు , నా అభిమాన సోదరులందరికి పాదాభివందనాలు ” అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.
టాలీవుడ్ సైమా విజేతల వివరాలు…
ఉత్తమ చిత్రం: సీతారామం
ఉత్తమ దర్శకుడు: ఎస్ఎస్ రాజమౌళి (RRR)
ఉత్తమ నటుడు: ఎన్టీఆర్ (RRR)
ఉత్తమ నటి: శ్రీలీల (ధమాకా)
ఉత్తమ విలన్: సుహాస్ (హిట్ 2)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్ చాయిస్): అడివి శేష్
ఉత్తమ నటి (క్రిటిక్స్ చాయిస్): మృణాల్ ఠాకూర్
ఉత్తమ సహాయ నటుడు: దగ్గుబాటి రానా (భీమ్లా నాయక్)
ఉత్తమ సహాయ నటి: సంగీత (మసూద)
ఉత్తమ హాస్యనటుడు: శ్రీనివాస్ రెడ్డి (కార్తికేయ 2)
ఉత్తమ సంగీత దర్శకుడు: ఎమ్ఎమ్ కీరవాణి (RRR)
ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్ (RRR)
ఉత్తమ గాయకుడు: రామ్ మిరియాల (డీజే టిల్లు)
ఉత్తమ గాయని: మంగ్లీ
ఉత్తమ నూతన హీరో: అశోక్ గల్లా (హీరో)
ఉత్తమ నూతన నటి : మృణాల్ ఠాకూర్ (సీతారామం)
ఉత్తమ నూతన దర్శకుడు: వశిష్ట (బింబిసార)
ఉత్తమ నూతన నిర్మాత: శరత్ అండ్ అనురాగ్ (మేజర్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సెంథిల్ కుమార్ (RRR)
ఫ్యాషన్ యూత్ ఐకాన్: శృతి హాసన్
ప్రామిసింగ్ స్టార్: బెల్లంకొండ గణేష్
సెన్సేషనల్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్: కార్తికేయ 2