Homeఎంటర్టైన్మెంట్SIIMA Awards 2021: మహేష్ కి ఉత్తమ హీరో.. ఇక ఎవరెవరికి ...

SIIMA Awards 2021: మహేష్ కి ఉత్తమ హీరో.. ఇక ఎవరెవరికి ఏ అవార్డులు !

SIIMA Awards 2021: Mahesh Babu Won Best Actor For Maharshi

SIIMA Awards 2021: దక్షిణాది చిత్ర పరిశ్రమకు అవార్డుల పండుగ అంటే.. ‘సైమా’నే(SIIMA). ఒక్క సైమా కార్యక్రమం కోసమే సౌత్ స్టార్స్ అందరూ కదిలి వస్తారు. అందుకే.. సౌత్ లో ప్రతిష్టాత్మక అవార్డు కార్యక్రమంగా ‘సైమా’ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. ఇంతకీ సైమాకి అర్ధం ఏమిటంటే.. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్. అయితే, ప్రతి సంవత్సరం వెండితెర తారలతో అంగరంగ వైభోగంగా జరగాల్సిన ఈ సైమా కార్యక్రమం కరోనా వైరస్ కారణంగా గత రెండేళ్లుగా నిర్వహించడం లేదు.

అందుకే, ఈ ఏడాది ఈ అవార్డుల వేడుకను వైభవంగా జరిపేందుకు సైమా నిర్వాహకులు భారీగా సిద్ధమై.. హైదరాబాద్ లో సైమా వేడుకకు రంగం సిద్ధం చేశారు. కాగా ఈ వేడుకల్లో సౌత్ తారలు పాల్గొని తమ అందాల వెలుగులలో తెగ మురిసిపోయారు. దాంతో కన్నుల పండుగలా సైమా అవార్డుల ఫంక్షన్ మొదలు అయింది. రెండ్రోజుల పాటు ఈ వేడుక జరిగింది.

SIIMA Awards 2021: Mahesh Babu Won Best Actor For Maharshi

దాదాపు దక్షిణాది తారలలో చాలామంది ఈ వేడుకకు హాజరయ్యారు. హాజరు అయిన సినీ ప్రముఖుల్లో సూపర్ స్టార్ మహేష్, దిల్ రాజు, మురళీ మోహన్, యంగ్ హీరో కార్తికేయ, అలాగే డైరెక్టర్ వంశీ పైడిపల్లి, ఇక సీనియర్ నటి జీవిత, మీనా తదితరులు ఈ వేడుకలో పాల్గొని సరదాగా గడిపారు. మరి సైమా అవార్డులను దక్కించుకున్న వారి వివరాలు ఈ కింద లిస్ట్ లో ఉన్నాయి.. గమనించగలరు.

ఉత్తమ నటుడిగా మహేశ్ బాబు (మహర్షి)
ఉత్తమ నటిగా సమంత (ఓ బేబి),
క్రిటిక్స్‌ విభాగంలో ఉత్తమ నటుడిగా నాని (జెర్సీ),
ఉత్తమ నటిగా రష్మిక మందన్న (డియర్‌ కామ్రేడ్‌),
ఉత్తమ ప్రతినాయకుడిగా కార్తికేయ (గ్యాంగ్‌లీడర్‌),
ఉత్తమ సహాయ నటిగా లక్ష్మి (ఓ బేబి) విజేతలుగా నిలిచారు.
అరంగేట్రం లో అద్భుత నటన కనబర్చిన కేటగిరీలో శివాత్మిక రాజశేఖర్ కు బెస్ట్ డెబ్యూ అవార్డు.
బెస్ట్ డెబ్యూ మేల్ కేటగిరీలో కోడూరి శ్రీసింహాకు అవార్డు. ‘మత్తు వదలరా’ చిత్రానికి గాను పురస్కారం.
ఏజెంట్ సాయి శ్రీనివాస్ చిత్రానికి గాను బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా స్వరూప్ కు అవార్డు.
మహర్షి చిత్రంలో ‘ఇదే కదా..’ పాటకు ఉత్తమ గీత రచయితగా శ్రీమణి.
మజిలి చిత్రానికి గాను ‘ప్రియతమ ప్రియతమ’ పాటకు ఉత్తమ గాయనిగా చిన్మయి శ్రీపాదకు పురస్కారం.
ఇస్మార్ట్ శంకర్ లో టైటిల్ సాంగ్ ఆలపించిన అనురాగ్ కులకర్ణికి ఉత్తమ గాయకుడిగా అవార్డు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular