Siddu Jonnalagadda : ఈమధ్య కాలంలో యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న యంగ్ హీరోలలో ఒకరు సిద్దు జొన్నలగడ్డ. ‘డీజే టిల్లు’ సిరీస్ తో సూపర్ హిట్స్ ని అందుకొని యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. ఈ చిత్రానికి ముందు సిద్దు జొన్నలగడ్డ చాలా సినిమాలే చేసాడు కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ‘గుంటూరు టాకీస్’ చిత్రంలో హీరో ఈయనే. కానీ ఆ సినిమాలో ఈయనకంటే హీరోయిన్ కి ఎక్కువ పేరు వచ్చింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసాడు. ఆ క్రమంలోనే దగ్గుబాటి రానా నిర్మాతగా వ్యవహరిస్తూ, సిద్దు జొన్నలగడ్డ ని హీరో గా పెట్టి ‘కృష్ణ & హిస్ లీల’ అనే సినిమా తీసాడు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఈ చిత్రం నేరుగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. అప్పటి ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఎగబడి చూసారు.
కానీ ఇలాంటి సినిమాలు థియేటర్స్ లోనే విడుదల అవ్వాలి, అప్పుడే సరైన అనుభూతి కలుగుతుంది అని ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు అనుకున్నారు. ఇన్ని రోజులు ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కాలేదు కానీ, ఎట్టకేలకు ఐదేళ్ల తర్వాత ఇప్పుడు థియేటర్స్ లో విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే ని పురస్కరించుకొని ఈ చిత్రం విడుదల కానుంది. యూత్ లో ప్రత్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్స్ లో విడుదల కాబోతుండడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ యూజర్లు ఈ సినిమాని థియేటర్స్ లో చూసి ఉండొచ్చు. కానీ ఎన్నో లక్షల మంది నెట్ ఫ్లిక్స్ ని ఉపయోగించడం లేదు. వాళ్లకు ఈ సినిమా ఒకటి ఉందనే విషయం కూడా తెలియదు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూసే అవకాశాలు ఉన్నాయి.
బ్రేకప్ అయ్యి జీవితం లో వేరే అమ్మాయితో ముందుకెళ్లిన ఒక అబ్బాయి, మళ్ళీ పాత ప్రేయసి ని కలిసి ప్యాచప్ అవ్వడం, ప్రస్తుతం ఉన్న అమ్మాయితో కూడా ప్రేమాయణం కొనసాగించడం, వీళ్లిద్దరి మధ్య ఆ కుర్రాడు ఎలా నలిగిపోయాడు అనేదే సినిమా. చివరికి ఏమైంది?, ఇద్దరినీ పెళ్లి చేసుకుంటాడా?, లేదా వాళ్లిద్దరూ అసలు నిజాన్ని తెలుసుకొని ఇతన్ని వదిలి వెళ్లిపోయారా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. చాలా ఆసక్తికరంగా ఈ సినిమా ఉంటుంది. ‘డీజే టిల్లు’ సిరీస్ తర్వాత ఈ చిత్రం నేరుగా థియేటర్స్ లో విడుదల అయ్యుంటే మామూలుగా ఉండేది కాదు, పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేదని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడు సిద్దు కి యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమాని చాలా మంది కొత్త సినిమా అని కూడా అనుకోవచ్చు. థియేటర్స్ లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తే లాంగ్ రన్ కూడా ఇరగ కుమ్మేయొచ్చు, చూడాలి మరి.