Siddu Jonnalagadda: అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ…ఆ సినిమా ప్రేక్షకుల్లో ఎంతటి ఇంపాక్ట్ ను ఇచ్చిందో మనందరికి తెలిసిందే. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్ తన తర్వాత సినిమాలకి కూడా కొనసాగించుకుంటూ వచ్చాడు. అర్జున్ రెడ్డి తర్వాత ఆయన చేసిన సినిమాల్లో అన్ని గీతాగోవిందం తప్ప మరే సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధించలేకపోయింది. కారణం ఏంటి అంటే ఆయన అన్ని సినిమాల్లో ఒకే రకంగా నటిస్తున్నాడు అంటూ చాలా విమర్శలు వస్తున్నాయి… నటనలో డెప్త్ చూపించకపోతే ఆయన ఇక షెడ్డుకి వెళ్లి పోవాల్సిందే అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సంవత్సరం వచ్చిన ‘కింగ్ డమ్’ సినిమాతో కూడా ఆయన ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయాడు. ఇక ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాల విషయంలో ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తున్నాడు. మంచి సినిమాలను చేసి నటుడిగా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేవారు ఉన్నారు. తెలంగాణ స్లాంగ్ ను వాడుకొని సూపర్ సక్సెస్ ని సాధించిన నటుడు సిద్దు జొన్నల గడ్డ…ప్రస్తుతం ఆయన డీజే టిల్లు ఫీవర్ నుంచి బయటికి రాలేకపోతున్నాడు. ఆయన ఏ మూవీ చేసిన అందులో తెలంగాణ స్లాంగు ను వాడుతూ అవే డైలాగులతో ప్రేక్షకులకు చీరాకు పుట్టిస్తున్నాడు…
ప్రస్తుతం ఆయన ‘తెలుసు కదా’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన మేరకు అంత గొప్పగా ఏం లేదని మరోసారి తన రొటీన్ నటనతో ప్రేక్షకులకు విసుగు పుట్టించాడని చాలామంది కామెంట్లు చేస్తున్నారు… ఇక బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో చేసిన జాక్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.
ఆ తర్వాత వచ్చిన ఈ సినిమా కూడా డిజాస్టర్ బాట పడుతుండడంతో ఆయన కెరీర్ డైలమాలో పడిపోయింది. ప్రస్తుతం ఆయన ఎలాంటి సినిమాలు చేయాలి. ప్రేక్షకులు తన నుంచి ఏం కోరుకుంటున్నారు అనే విషయాన్ని తెలుసుకొని ఆ జానర్ సినిమాలు చేస్తే బాగుంటుందని కొంతమంది సినిమా విమర్శకులు సైతం అతన్ని విమర్శిస్తున్నారు.
ఆడియన్స్ కి ఎప్పటికప్పుడు కొత్తదనం చూపించాలి. ఎప్పుడు రొటీన్ యాక్టింగ్ చేసుకుంటూ వెళ్తే ప్రేక్షకులకు నచ్చదని ఇంకొంతమంది నెటిజన్లు వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు… ఇక మీదట రాబోయే సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…