Siddu Jonnalagadda- Ravi Teja: ఇటీవల కాలం లో తమిళనాడు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన కొన్ని సినిమాలలో ఒకటి ‘మానాడు’..వెంకట్ ప్రభు దర్శకత్వం లో శింబు హీరో గా తెరకెక్కిన ఈ చిత్రం శింబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో డీలాపడిన శింబు కెరీర్ ని మళ్ళీ దారిలోకి పెట్టిన చిత్రం ఇది..ఈ సినిమాలో శింబు పాత్ర ఎంత హైలైట్ అయ్యిందో..SJ సూర్య పోషించిన నెగటివ్ క్యారక్టర్ కూడా అంతే హైలైట్ అయ్యింది.

ఒక్కమాట లో చెప్పాలంటే కొన్ని సన్నివేశాలలో SJ సూర్య పాత్ర హీరో పాత్రని కూడా డామినేట్ చేసేస్తుంది..ఆద్యంతం ఉత్కంఠగా సాగే ఈ పొలిటికల్ థ్రిల్లర్ ని తెలుగు లో రీమేక్ చేసేందుకు సురేష్ బాబు హక్కులను కొనుగోలు చేసాడు..ఈ సినిమా కథ ని తెలుగు నేటివిటీ కి తగ్గట్టుగా మార్చే సత్తా కేవలం డైరెక్టర్ హరీష్ శంకర్ మాత్రమే ఉందని నమ్మిన సురేష్ బాబు ఆ బాధ్యతలను ఆయనకీ అప్పజెప్పాడు.
హరీష్ శంకర్ ఈ సినిమా స్క్రిప్ట్ ని పూర్తి చేసి ఇటీవలే సురేష్ బాబు కి వినిపించాడట..ఆయనకీ ఎంతగానో నచ్చింది..ఇక ఈ సినిమా లీడ్ క్యారెక్టర్స్ గా మాస్ మహా రాజా రవితేజ మరియు DJ టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ ని తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం..శింబు పాత్రని సిద్దు జొన్నలగడ్డ మరియు SJ సూర్య పాత్ర ని రవితేజ చేస్తే బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోతుందని హరీష్ శంకర్ ఆలోచన అట.

ఇక ఈ సినిమాకి కథ, మాటలు మరియు స్క్రీన్ ప్లే డైరెక్టర్ హరీష్ శంకర్ రాయగా, సీనియర్ డైరెక్టర్ దశరధ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని తెలుస్తుంది..అయితే విపరీతమైన మాస్ ఇమేజి ఉన్న రవితేజ ని నెగటివ్ రోల్ లో చూపిస్తే ఆయన అభిమానులు ఒప్పుకుంటారా..లేదా అనే సందిగ్ధం నిర్మాత సురేష్ బాబు కి ఉందట.
రవితేజ గారి ఇమేజి కి తగ్గట్టుగానే ఈ స్క్రిప్ట్ సిద్ధమైంది అని..తప్పకుండ ఆయన ఒప్పుకొని ఈ పాత్ర చేస్తాడని..ఒప్పించే బాధ్యత నాది అని హరీష్ శంకర్ మాట ఇచ్చాడట..మరి రవితేజ ఆ పాత్ర చెయ్యడానికి ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి..ఒప్పుకుంటే మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని ముందే ఫిక్స్ అయిపోవచ్చు.