https://oktelugu.com/

Siddharth Takkar Movie Review: సిద్దార్థ్ ‘టక్కర్’ మూవీ ఫుల్ రివ్యూ

వరుసగా లవ్ స్టోరీస్ లో చూసిన హీరో సిద్దార్థ్ ని ఒక్కసారిగా ఇలాంటి రోల్ లో చూడడం అంటే ఆడియన్స్ కి కాస్త కష్టమే. ఆయన లుక్ కూడా చాలా బిన్నంగా అనిపించింది, 40 ఏళ్ళ వయస్సు దాటినా కూడా నిత్యా యవ్వనం తో ఉండే సిద్దార్థ్ స్క్రీన్ ప్రెజన్స్ ఈ చిత్రం లో బాగాలేదని చెప్పొచ్చు. ఇక నటన కూడా ఎదో కొత్తగా ట్రై చెయ్యాలి అనే ప్రయత్నం తోనే చేసాడు కానీ, చూసేందుకు అసలు ఏమాత్రం బాగలేదు.

Written By:
  • Vicky
  • , Updated On : June 9, 2023 / 12:02 PM IST

    Siddharth Takkar Movie Review

    Follow us on

    Siddharth Takkar Movie Review: నటీనటులు : సిద్దార్థ్, దివ్యాంష కౌశిక్ , అభిమన్యు సింగ్ , విగ్నేష్ మరియు యోగిబాబు
    దర్శకత్వం : కార్తీక్ జి క్రిష్
    మ్యూజిక్ : నివాస్ కె ప్రసన్న

    ఒకప్పుడు యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో సిద్దార్థ్. బొమ్మరిల్లు , నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపేసాడు. ఆయన సినిమా వస్తుందంటే అప్పట్లో కుర్రాళ్ళు కాలేజీలు ఎగ్గొట్టి మరీ వెళ్లేవారు. తెలుగు తో పాటుగా హిందీ , తమిళం లో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసాడు. అయితే సిద్దార్థ్ ఒక్క ఇండస్ట్రీ లో కూడా స్థిరంగా ఉండకపోవడం వల్ల ఆయన పెద్ద రేంజ్ కి వెళ్లలేకపోయాడని అందరూ అంటూ ఉంటారు. మళ్ళీ ఆయన టాలీవుడ్ లోకి ‘మహాసముద్రం’ అనే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం పెద్దగా సక్సెస్ కాలేదు, ఇప్పుడు మళ్ళీ ఆయన ‘టక్కర్’ అనే చిత్రం తో మన ముందుకు వచ్చాడు, ఈ సినిమా తో సిద్దార్థ్ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యాడా లేదా అనేది చూద్దాం.

    కథ :

    ధనవంతుడు అవ్వాలని కోరిక ఉన్న ఒక పేద కుర్రాడి కథ ఇది. ఆ కలలతో చెన్నై కి వచ్చిన ఈ కుర్రాడు, ధనవంతుడు అవ్వడానికి చెయ్యని ప్రయత్నం అంటూ ఏది ఉండదు. అలాంటి ప్రయత్నాల్లో ఉన్నప్పుడు అతనికి ఎదురైనా సమస్యలే సినిమా. మధ్యలో ఆయన అత్యంత ధనవంతుడి కూతురు ని ప్రేమిస్తాడు, ఆమె వల్ల కూడా ఇతనికి కొన్ని సమస్యలు ఎదురు అవుతాయి. వీటి అన్నిటిని దాటుకొని హీరో తన కలని నెరవేర్చుకున్నాడా లేదా అనేదే స్టోరీ.

    విశ్లేషణ :

    వరుసగా లవ్ స్టోరీస్ లో చూసిన హీరో సిద్దార్థ్ ని ఒక్కసారిగా ఇలాంటి రోల్ లో చూడడం అంటే ఆడియన్స్ కి కాస్త కష్టమే. ఆయన లుక్ కూడా చాలా బిన్నంగా అనిపించింది, 40 ఏళ్ళ వయస్సు దాటినా కూడా నిత్యా యవ్వనం తో ఉండే సిద్దార్థ్ స్క్రీన్ ప్రెజన్స్ ఈ చిత్రం లో బాగాలేదని చెప్పొచ్చు. ఇక నటన కూడా ఎదో కొత్తగా ట్రై చెయ్యాలి అనే ప్రయత్నం తోనే చేసాడు కానీ, చూసేందుకు అసలు ఏమాత్రం బాగలేదు. ఇక ఈ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ జి క్రిష్ ఒక జానర్ మీద కాకుండా వివిధ రకాల జానర్స్ సమ్మేళనం తో తీసాడు. కాసేపు క్రైమ్ థ్రిల్లర్ గా, కాసేపు లవ్ స్టోరీ గా , మరికాసేపు యాక్షన్ జానర్ గా, ఇలా ఇన్ని రకాల జానర్స్ కనిపిస్తాయి మనకి. ప్రారంభించిన ప్లేట్ బాగుంది, ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బాగుంది అనే అనుభూతి కలుగుతుంది.

    కానీ సెకండ్ హాఫ్ మాత్రం కంప్లీట్ గా ట్రాక్ తప్పిపోతుంది, కథ ఎక్కడ నుండి ఎటు వెళ్తుందో ఎవరికీ అర్థం కాదు, ఆడియన్స్ మైండ్ తో ఫుట్ బాల్ ఆడుకొని , వాళ్ళ సహనానికి పరీక్ష పెట్టినట్టుగా అనిపిస్తాది. సిద్దార్థ్ కి సూట్ కానీ ఇలాంటి సినిమాలు అవసరమా, ఆయనకీ తెలిసిన లవ్ స్టోరీస్ తీసుకోవచ్చు కదా అని చూసే ప్రతీ ఒక్కరికి అనిపిస్తుంది. ఇక ఈ చిత్రం హీరోయిన్ గా నటించిన దివ్యాంష కౌశిక్ పర్వాలేదు అనిపించింది. ముందు సినిమాలతో పోలిస్తే ఈమె ఈ చిత్రం లో చాలా బోల్డ్ గా నటించింది, రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. ఇది కుర్రాళ్లకు బాగా నచ్చొచ్చు, కేవలం ఆమె కోసం ఒకసారి సినిమా చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి సంగీతం అందించిన నివాస్ కె ప్రసన్న చాలా యావరేజి మ్యూజిక్ ఇచ్చాడు, పాటలు ఒక్కటి కూడా చూడతగినదిగా లేదు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతంత మాత్రం గానే ఉంది.

    చివరి మాట :

    సిద్దార్థ్ నుండి వచ్చిన మరో ఫ్లాప్ సినిమా, కేవలం ఆయనని చాలా కాలం తర్వాత వెండితెర మీద చూడబోతున్నాము అనుకునే అభిమానులు మాత్రమే ఈ సినిమాకి వెళ్ళండి.

    రేటింగ్ : 2/5