Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి లు హీరోయిన్లుగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. 12వ రోజు కూడా ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. మరోపక్క విమర్శకులు సైతం ఇది అద్భుతమైన ప్రయోగాత్మక సినిమా అంటూ పొగడ్తల వర్షం కురిపించడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అయింది.
అందుకే, సెకండ్ వీక్ లోనూ ఈ సినిమాకు ఇంకా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. సినిమాకి ఫుల్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో ఇంకా స్టడీగానే థియేటర్ రెవెన్యూను ఈ చిత్రం సాధిస్తోంది.
మరి ఈ చిత్రం 12 రోజుల కలెక్షన్ల వివరాలను ఓసారి గమనిస్తే :
గుంటూరు 1.20 కోట్లు
కృష్ణా 0.95 కోట్లు
నెల్లూరు 0.60 కోట్లు
నైజాం 9.08 కోట్లు
సీడెడ్ 2.50 కోట్లు
ఉత్తరాంధ్ర 2.14 కోట్లు
ఈస్ట్ 0.99 కోట్లు
వెస్ట్ 0.86 కోట్లు
ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 18.32 కోట్లు
ఓవర్సీస్ 3.43 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.90 కోట్లు
Also Read: ‘శ్యామ్ సింగరాయ్’ 11 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ !
ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 24.65 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.
అన్నట్టు ఈ ‘శ్యామ్ సింగ రాయ్’కి హిట్ ప్లాప్ లతో సంబంధం లేదు. ఎందుకంటే.. ఈ సినిమాను నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. ఈ సినిమా లాభనష్టాలన్నీ నిర్మాతకే సొంతం. అయితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ. 22కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఇప్పటి వరకు రూ.2.49 కోట్లు రాబట్టింది. అంటే పూర్తి లాభాల్లోకి ‘శ్యామ్ సింగ రాయ్’ వెళ్ళిపోయాడు.
కానీ ఏపిలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా అక్కడ ఈ సినిమాకి పెద్దగా కలెక్షన్స్ రాలేదు. మిగిలిన చోట్ల కలెక్షన్స్ బాగుండటంతో శ్యామ్ బయట పడ్డాడు. ఎలాగైనా స్ట్రాంగ్ కమ్ బ్యాక్ హిట్ కోసం నాని ఎంతో కసితో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా చేశాడు. చివరకు సినిమా సూపర్ హిట్ అయింది.
Also Read: శ్యాం సింగరాయ్ మూవీ విలన్.. ఇతన్ని తప్ప వేరే వారిని ఊహించుకోలేము