https://oktelugu.com/

Shyam Singha Roy 4 days collections: ‘శ్యామ్ సింగరాయ్’ 4 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ !

Shyam Singha Roy 4 days collections: నేచురల్‌ స్టార్‌ నాని సాలిడ్ హిట్ తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వడానికి ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా చేశాడు. నిజానికి నాని గత మూడు చిత్రాలు గ్యాంగ్ లీడర్, వి, టక్ జగదీశ్ అనుకున్నంత విజయం సాధించలేదు. దాంతో నానికి భారీ హిట్ కొట్టడం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా చేశాడు. సినిమాకి మంచి రివ్యూస్ వచ్చాయి. అలాగే సినిమా ఫస్ట్ షో తర్వాత పాజిటివ్ ఫీడ్ […]

Written By: , Updated On : December 28, 2021 / 03:51 PM IST
Follow us on

Shyam Singha Roy 4 days collections: నేచురల్‌ స్టార్‌ నాని సాలిడ్ హిట్ తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వడానికి ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా చేశాడు. నిజానికి నాని గత మూడు చిత్రాలు గ్యాంగ్ లీడర్, వి, టక్ జగదీశ్ అనుకున్నంత విజయం సాధించలేదు. దాంతో నానికి భారీ హిట్ కొట్టడం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా చేశాడు. సినిమాకి మంచి రివ్యూస్ వచ్చాయి. అలాగే సినిమా ఫస్ట్ షో తర్వాత పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.

Shyam Singha Roy 4 days collections

Shyam Singha Roy 4 days collections

వాస్తవానికి అఖండ, పుష్ప సినిమాల కంటే కూడా శ్యామ్ సింగరాయ్ సినిమాకే ఎక్కువ పాజిటివ్ టాక్ వచ్చింది. ఇదొక అద్భుతమైన ప్రయోగాత్మక సినిమా అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. అయితే, ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదు అని పుకార్లు బాగా వినిపించాయి. కానీ ఆ పుకార్లలో ఏ మాత్రం నిజం లేదని శ్యామ్ సింగరాయ్ నిరూపించాడు.

మొదటి 3 రోజులు పాటు మంచి కలెక్షన్స్ ను రాబట్టాడు. మరి ఓవరాల్ గా ఈ సినిమాకు ఇప్పటివరకు టోటల్ వరల్డ్ వైడ్ గా ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయో చూద్దాం.

శ్యామ్ సింగరాయ్ లేటెస్ట్ కలెక్షన్ల వివరాలను ఏరియాల వారిగా చూస్తే.

నైజాం : రూ. 6.90 కోట్లు
గుంటూరు : రూ. 0.86 కోట్లు
కృష్ణా : రూ. 0.64 కోట్లు
నెల్లూరు : రూ. 0.43 కోట్లు
సీడెడ్ : రూ. 1.82 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ. 1.55 కోట్లు
ఈస్ట్ : రూ. 0.68 కోట్లు
వెస్ట్ : రూ. 0.57 కోట్లు

Also Read: నష్టాల వలయంలో కొట్టుమిట్టాడుతున్న ‘శ్యామ్ సింగరాయ్’

ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకొని చూస్తే : 13.45 కోట్లు షేర్ వచ్చింది.

ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం గ్రాస్ కలుపుకుని చూస్తే : 22.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు కర్ణాటక కలుపుకుని చూస్తే: 2.40 కోట్లు వచ్చాయి.

ఇక ఓవర్సీస్ లో రూ. 3.20 కోట్లు వచ్చాయి.

ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా రూ. 19.04 కోట్లు ఈ చిత్రం రాబట్టింది.

అలాగే ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా గ్రాస్ చూస్తే.. రూ.34 కోట్లు గ్రాస్ ఈ చిత్రం రాబట్టింది.

Also Read:  అదిరిపోయే కలెక్షన్లు రాబడుతున్న ‘శ్యాం సింగ రాయ్’

Tags