Shyam Singha Roy In Oscar Race: ఆస్కార్ బరిలో శ్యామ్ సింగరాయ్.. ఇది తెలుగు సినిమాకే గర్వకారణం

Shyam Singha Roy In Oscar Nominations Race: నాని నటించిన శ్యామ్ సింగరాయ్ మరో అరుదైన ఫీట్ అందుకుంది. ఈ మూవీ మూడు విభాగాల్లో ఆస్కార్ కి నామినేట్ అయ్యింది. దీంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యంగ్ డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యన్ శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని పీరియాడిక్, ఫిక్షనల్ జోనర్ లో తెరకెక్కించారు. నాని రెండు భిన్నమైన పాత్రల్లో ఆకట్టుకోగా హీరోయిన్ సాయి పల్లవి మరోసారి వెండితెరపై అద్భుతం చేసింది. కృతి శెట్టి […]

Written By: Shiva, Updated On : August 19, 2022 12:32 pm
Follow us on

Shyam Singha Roy In Oscar Nominations Race: నాని నటించిన శ్యామ్ సింగరాయ్ మరో అరుదైన ఫీట్ అందుకుంది. ఈ మూవీ మూడు విభాగాల్లో ఆస్కార్ కి నామినేట్ అయ్యింది. దీంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యంగ్ డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యన్ శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని పీరియాడిక్, ఫిక్షనల్ జోనర్ లో తెరకెక్కించారు. నాని రెండు భిన్నమైన పాత్రల్లో ఆకట్టుకోగా హీరోయిన్ సాయి పల్లవి మరోసారి వెండితెరపై అద్భుతం చేసింది. కృతి శెట్టి ఈ చిత్రంలో మరొక హీరోయిన్ గా నటించారు.

Shyam Singha Roy movie

గత ఏడాది విడుదలైన ఈ మూవీ రూ. 37 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ రాబట్టింది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మంచి వసూళ్లు అందుకుంది. పుష్ప, అఖండ చిత్రాలు కారణంగా శ్యామ్ సింగరాయ్ చాలా వరకు వసూళ్లు కోల్పోయింది. అలాగే ఈ మూవీ విడుదల నాటికి కోవిడ్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయినప్పటికీ శ్యామ్ సింగరాయ్ రికార్డు కలెక్షన్స్ అందుకుంది.

Also Read: Sukumar -Ajay Ghosh: పుష్ప సినిమా చేయనన్న నటుడు.. తిట్టేసిన సుకుమార్

ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది ఈ చిత్రం. దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ టాలెంటెడ్ దర్శకుడిగా నిరూపించుకున్నాడు. సర్వత్రా అభినందనలు అందుకున్న శ్యామ్ సింగరాయ్ మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. ఈ మూవీ ప్రఖ్యాత ఆస్కార్ బరిలో నిలిచింది. పీరియాడిక్ ఫిల్మ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, క్లాసికల్ కల్చర్ డాన్స్ ఇండీ ఫిలిం విభాగాల్లో ఆస్కార్ కి నామినేట్ అయ్యింది. ఈ గౌరవానికి ఎంపికై తెలుగు పరిశ్రమకు కీర్తి తెచ్చిపెట్టింది.

Shyam Singha Roy movie

శ్యామ్ సింగరాయ్ ఆస్కార్ కి నామినేటైన నేపథ్యంలో చిత్ర ప్రముఖులు యూనిట్ సభ్యులకు అభినందనలు తెలుపుతున్నారు. కమిటీ మెంబర్స్ ని మెప్పించి అకాడమీ అవార్డు గెలుపొందాలని కోరుకుంటున్నారు. ఇక శ్యామ్ సింగరాయ్ చిత్రానికి సంగీతం మిక్కీ జె మేయర్ అందించారు. ఆయన పాటలకు అద్భుత రెస్పాన్స్ దక్కింది.

Also Read: Anasuya Bharadwaj: ఇండస్ట్రీలో గిల్లితే గిల్లించుకోవాలట.. బాంబు పేల్చిన అనసూయ

 

 

Tags