Shubham Collection: స్టార్ హీరోయిన్ సమంత(Samantha Ruth Prabhu) నిర్మాతగా వ్యవహరించిన మొట్టమొదటి చిత్రం ‘శుభమ్'(Subham Movie) నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మంచి హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ అనే టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ట్రైలర్ తోనే ఈ చిత్రం ఆడియన్స్ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. కచ్చితంగా ఈ సినిమాలో ఎదో ఉంది అనే ఫీలింగ్ ని రప్పించింది. కొత్తవాళ్లతో సమంత చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ అయ్యేలా ఉందని అందరికీ విడుదలకు ముందే అనిపించింది. సినిమా ఔట్పుట్ మీద తనకు బలమైన నమ్మకం ఉండడంతో విడుదలకు ఒక్క రోజు ముందే స్పెషల్ ప్రీమియర్ షోస్ ని ఏర్పాటు చేసింది సమంత. ఈ షోస్ నుండి ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. సినిమా పై విడుదలకు ముందే సోషల్ మీడియా పాజిటివ్ అభిప్రాయం కలిగేలా చేసింది ఈ ప్రీమియర్ షోస్.
Also Read: చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీ ఆ హిట్ సినిమా కి రీమేక్ గా రాబోతోందా..?
ఇక విడుదల తర్వాత అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. సమంత బ్రాండ్ ఇమేజ్ ఈ చిత్రానికి ఆడియన్స్ ని తీసుకొని రావడం లో సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా ఆమెని అందరు ఓవర్సీస్ క్వీన్ అని పిలుస్తూ ఉంటారు. ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా అక్కడ 1 మిలియన్ కి పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినవి ఉన్నాయి. ఇక శుభమ్ చిత్రానికి నార్త్ అమెరికా లో కేవలం ప్రీమియర్ షోస్ నుండే 20 వేల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కొత్త వాళ్ళతో ఇంత రేంజ్ వసూళ్లు రావడం అంత తేలికైన విషయం కాదు. నార్త్ అమెరికా మొత్తం మీద ఈ సినిమాకు పడిన షోస్ కేవలం 190 మాత్రమే. వచ్చిన ఆ గ్రాస్ మొత్తం సమంత పేరు మీద వచ్చినవే అనుకోవాలి. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి కోటి 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ ఈ చిత్రానికి కోటి 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. గడిచిన 24 గంటల్లో బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి 11 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. రెండవ రోజు దాదాపుగా అన్ని ప్రాంతాల్లో మొదటి రోజు కంటే మెరుగైన కలెక్షన్స్ ని నమోదు చేసుకుంది. విడుదలకు ముందు ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా మూడు కోట్ల రూపాయలకు జరిగింది. ఈ మొత్తాన్ని కేవలం ఈ వీకెండ్ తోనే రీ కవర్ చేస్తుందని అంటున్నారు. అదే కనుక జరిగితే సమంతకు నిర్మాతగా మొదటి చిత్రం తోనే భారీ విజయం దక్కింది అనుకోవచ్చు. చూడాలి మరి ఈ సినిమా రేంజ్ రాబోయే రోజుల్లో ఎంత వరకు వెళ్తుంది అనేది.