Shruti Haasan – Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని మరో వారం రోజుల్లో థియేటర్స్ లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే..ఈ సినిమా మీద అభిమానులు భారీ స్థాయిలోనే అంచనాలు పెట్టుకున్నారు..ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి నుండి చాలా కాలం తర్వాత వస్తున్న ఊర మాస్ చిత్రం కావడం..అందులోనూ మాస్ మహారాజ రవితేజ ఇందులో మరో కీలక పాత్ర పోషించడం మూవీ పై మరింత అంచనాలు పెంచేలా చేసింది.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు మరియు టీజర్స్ కి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదిరిపోయాయి..ప్రొమోషన్స్ కూడా రీసెంట్ గానే ప్రారంభించారు..అయితే ఈ ప్రొమోషన్స్ లో భాగంగా శృతి హాసన్ ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి..ముఖ్యంగా ‘నువ్వు శ్రీదేవి అయితే..నేను చిరంజీవి అంట’ అంటూ సాగే పాట షూటింగ్ సమయం లో ఆమె ఎదురుకున్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ ‘ఈ సినిమాలో సూపర్ హిట్ గా నిలిచినా శ్రీదేవి సాంగ్ కోసం మేమందరం చాలా కష్టపడాల్సి వచ్చింది..ముఖ్యంగా నేను అయితే చాలా ఇబ్బంది పడ్డాను..ఎందుకంటే ఆ సాంగ్ ని ఫ్రాన్స్ లోని మంచు కొండల్లో చిత్రీకరించారు..అక్కడ మైనస్ డిగ్రీ ఉంది..చలితో రక్తం గడ్డ కట్టే రేంజ్ అన్నమాట..నాకు స్లీవ్ లెస్ బ్లౌజ్ తో కూడిన చీర కాస్ట్యూమ్ గా ఇచ్చారు..చలితో వణికిపోయాను..ఆ సమయం లో డ్యాన్స్ చెయ్యడం..ఎక్సప్రెషన్స్ ఇవ్వడం వంటివి చాలా కష్టం..నేను అది ఒక ఛాలెంజ్ గా తీసుకొని చేశాను..సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది..కచ్చితంగా మీరందరు ఎంజాయ్ చేస్తారు’ అంటూ శృతి హాసన్ చెప్పుకొచ్చింది.

ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది..సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు..సినిమా మొత్తం మెగాస్టార్ మార్క్ తో అదిరిపొయ్యే రేంజ్ లో వచ్చిందట..రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి కెరీర్ లో బెస్ట్ మూవీ గా ఈ చిత్రం నిలిచిపోతుండట..చూడాలిమరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో అనేది.
[…] […]