https://oktelugu.com/

Salaar : మరోసారి సలార్ లో అదే పాత్రలో అలరించనున్న శృతిహాసన్..

టీచరుగా శృతిహాసన్ కనిపించడం ఇది మొదటిసారి అయితే కాదు. ఆల్రెడీ నాగచైతన్య సినిమా ప్రేమమ్ లో ఈమె టీచర్ గా కనిపించింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : August 27, 2023 / 03:07 PM IST
    Follow us on

    Salaar : శృతిహాసన్ తెలుగు తెరకి హీరోయిన్ గా పరిచయమై ఎన్నో సంవత్సరాలు కావస్తున్న ఇంకా కూడా ఆమెకి స్టార్ హీరోలతో అవకాశాలు మాత్రం తగ్గలేదు. ఈ మధ్యనే చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోస్ తో వాల్తేరు వీరయ్య,‌ వీర సింహా రెడ్డి లాంటి సూపర్ హిట్స్ కొట్టిన ఈ హీరోయిన్, ప్రస్తుతం ఏకంగా పాన్ ఇండియా సినిమా సలార్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

    ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శృతిహాసన్ పాత్ర ఏమిటి అనే విషయం రివీల్ అయింది. ఈ సినిమాలో శృతిహాసన్ ఒక టీచర్ పాత్రలో నటిస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూ ద్వారా లీక్ అయింది.

    అసలు విషయానికి వస్తే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉన్న ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఒక ఇంటర్వ్యూ చేయగా వారు తాము సలార్ సినిమాలో నటించామని చెబుతూ అందులో తాము శృతిహాసన్ దగ్గర చదువు చెప్పించుకునే పిల్లలుగా కనిపిస్తామని లీక్ చేసేశారు. ఇకపోతే శృతిహాసన్ పాత్ర పేరు ఆధ్యా అనే విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ఎప్పుడో వెల్లడించారు. కానీ ఆమె పాత్ర ఏమిటి అనే విషయం మీద ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఇక ఇప్పుడు ఈ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఆ విషయం లీక్ అయింది.

    టీచరుగా శృతిహాసన్ కనిపించడం ఇది మొదటిసారి అయితే కాదు. ఆల్రెడీ నాగచైతన్య సినిమా ప్రేమమ్ లో ఈమె టీచర్ గా కనిపించింది. ఇక మరోసారి అలానే చీరల్లో టీచరుగా అందంగా కనిపించబోతుందేమో అని ఆమె ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు.

    ఇక సలార్ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రాన్ని సినిమాని భారీ బడ్జెట్ తో హోం బలే ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మీద ఉన్న అంచనాలతో ఇప్పటికే షాకింగ్ ఈ సినిమా బిజినెస్ జరుగుతోంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందనేది వేచి చూడాల్సి ఉంది.