Shruti Haasan: కమల్ హాసన్(Kamal Hassan) నట వారసురాలిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న హీరోయిన్ శృతి హాసన్(Sruthi Hassan). ఈమె కేవలం ఒక నటి మాత్రమే కాదు, అద్భుతమైన డ్యాన్సర్, గాయని కూడా. టాలెంట్ లో తండ్రికి తగ్గ తనయురాలు అని అనిపించుకుంది. సినిమాల్లో ఈమె తండ్రి పేరు చెప్పుకొనే ఎంట్రీ ఇచ్చింది కానీ, అవకాశాలు మాత్రం తన సొంత పేరు మీదనే దక్కించుకుంది. కెరీర్ ప్రారంభం లో ఈమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్స్. అందరూ ఈమెను ఐరన్ లెగ్ అని పిలుస్తూ ఉండేవారు. అలాంటి రోజుల్లో ఈమె హీరోయిన్ గా చేసిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. అప్పటి నుండి ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
శ్రీమంతుడు, ఎవడు, సలార్, రేస్ గుర్రం ఇలా స్టార్ హీరోలందరితో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ని కొట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకుంది. కేవలం నేటి తరం స్టార్ హీరోలతో మాత్రమే కాదు సీనియర్ హీరోలైన చిరంజీవి తో ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య తో ‘వీర సింహా రెడ్డి’ వంటి సూపర్ హిట్ సినిమాలు కూడా చేసింది. అలా ఐరన్ లెగ్ అనే ముద్ర నుండి గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న శృతి హాసన్ ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth) తో కలిసి ‘కూలీ'(Coolie Movie) అనే చిత్రం చేస్తుంది. లోకేష్ కనకరాజ్(Lokesh Kanakaraj) దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్ గా శృతి హాసన్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో రజినీకాంత్ గురించి ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆమె మాట్లాడుతూ ‘సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి నటించడం నేను చేసుకున్న అదృష్టం. ఆయన ఇంత పెద్ద సూపర్ స్టార్ ఎలా అయ్యాడో, ఆయనతో కలిసి నటిస్తున్నప్పుడే అర్థమైంది. పని పట్ల అంకితభావం, పాత్ర కోసం ఎంత కష్టపడడానికైనా సిద్దపడే తత్వమే ఆయన్ని ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఆయన నుండి నా కెరీర్ కి అవసరమయ్యే వృత్తి పరమైన అంశాలను మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితాన్ని కూడా ఆదర్శంగా తీసుకొని అనేక విషయాలు నేర్చుకున్నాను. సెట్స్ లో రజినీ సార్ ఉన్నంతసేపు ఒక పాజిటివ్ ఎనర్జీ మనతో ఉన్నట్టుగా అనిపిస్తుంది’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అదే విధంగా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గురించి మాట్లాడుతూ ‘ఆయన సినిమాలో నటించాలి అనే నా కల ఎట్టకేలకు నెరవేరింది’ అంటూ చెప్పుకొచ్చింది. గత కొంతకాలంగా శృతి హాసన్ లోకేష్ కనకరాజ్ తో డేటింగ్ చేస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు లోకేష్ గురించి ఆమె ఈ స్థాయిలో మాట్లాడడంతో కచ్చితంగా వీళ్ళ మధ్య ఎదో జరుగుతుందని నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.