
Salaar Movie: నేషనల్ స్టార్ అండ్ డార్లింగ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న “సలార్” సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పైగా ఇప్పటికే శృతిహాసన్ ది ఫలానా క్యారెక్టర్ అంటూ అనేక రూమర్లు కూడా వచ్చాయి. ముఖ్యంగా శృతిహాసన్ ది ఒక జర్నలిస్ట్ పాత్ర. అయితే, ఆమె పాత్ర చాలా చిన్న పాత్ర. కేవలం ముప్పై నిముషాలు మాత్రమే ఆమెకు సినిమాలో స్పేస్ ఉంది.
అయితే, తాజాగా ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల నుంచి వినిపిస్తోన్న టాక్ ప్రకారం.. శృతిహాసన్ పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుందట. పైగా ఆమె పాత్ర సినిమాను మలుపు తిప్పే పాత్ర అని, హీరోలో మార్పు రావడానికి ఆమె పాత్రనే ముఖ్య కారణం అని తెలుస్తోంది. సలార్ లో ప్రభాస్ వి రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్. అందులో ఒక క్యారెక్టర్ పక్కా విలన్ క్యారెక్టర్.
ఆ విలన్ కి ప్రియురాలిగానే శృతిహాసన్ కనిపించబోతుంది. చివరకు ఆ విలన్ చేతిలోనే ఆమె పాత్ర చనిపోతుందట. తానూ ప్రేమించిన అమ్మాయినే చంపాల్సిన పరిస్థితి తనకు రావడంతో ప్రభాస్ పాత్రలో మార్పు వస్తోందట. మొత్తానికి ప్రభాస్ చేతిలో శృతిహాసన్ చనిపోతుంది అన్నమాట. అయినా శృతిహాసన్ కి జర్నలిస్ట్ పాత్రలు కొత్తేమి కాదు.
గతంలో సూర్య నటించిన సింగం-3లో కూడా శృతిహాసన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నటించింది. ఇప్పుడు దాదాపు అదే తరహా పాత్రలోనే సలార్ లో కూడా కనిపించబోతుంది. ఇక కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సినిమా అనగానే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
దీనికి తోడు ఆరడుగుల ఆజానుబాహుడిని ఢీ కొట్టే ప్రతినాయకుడి పాత్రలో ప్రభాస్ కనిపించబోతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also Read: శరవేగంగా సాగుతున్న ఆదిపురుష్ షూటింగ్.. పూర్తయ్యేది అప్పుడే!