https://oktelugu.com/

Shriya Saran: గోవాలో బికినీలో కూతురుతో ఎంజాయ్ చేస్తున్న శ్రీయ.. వైరల్ ఫోటోలు!

Shriya Saran: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఇష్టం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ శ్రీయ ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అయినప్పటికీ ఏమాత్రం తన క్రేజ్ తగ్గకుండా ఇప్పటికి పలు సినిమాలలో వివిధ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రీయ సినిమాల పరంగా మాత్రమే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 29, 2021 / 04:38 PM IST
    Follow us on

    Shriya Saran: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఇష్టం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ శ్రీయ ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అయినప్పటికీ ఏమాత్రం తన క్రేజ్ తగ్గకుండా ఇప్పటికి పలు సినిమాలలో వివిధ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

    ఇదిలా ఉండగా శ్రీయ సినిమాల పరంగా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే 2018లో శ్రీయ రష్యన్ యువకుడు ఆండ్రీ కోషీవ్‌ ను వివాహం చేసుకున్న విషయాన్ని తెలిపారు. అదే విధంగా ఈ ఏడాది తనకు ఒక కూతురు జన్మించిందనే విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా తన కూతురు ఫోటోలు షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తన కూతురి ఫోటో షేర్ చేస్తూ తన కూతురు పేరు రాధా అని పెట్టినట్లు వెల్లడించారు.

    ఇదిలా ఉండగా శ్రియ తాజాగా తన కుటుంబంతో కలిసి గోవా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గోవా బీచ్ లో తన భర్త, తన కూతురుతో కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తున్నటువంటి ఫోటోలను శ్రీయ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    గ్రీన్ కలర్ స్విమ్ సూట్ ధరించిన శ్రీయ తన కూతురి చేతులని పట్టుకుని సముద్రతీరాన బుడిబుడి అడుగులు వేస్తూ ఉన్నటువంటి వీడియోని కూడా షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలను ఇన్స్టా స్టోరీ లో షేర్ చేస్తూ “లవ్‌ అండ్‌ హ్యాపినెస్‌ టూ యూ ఆల్‌'”అని ‘గ్రేట్‌ఫుల్‌’ అని స్మైలింగ్‌ ఫేస్ ఉన్న ఎమోజీ లను షేర్ చేశారు. ప్రస్తుతం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.