Shreya Chaudhary: సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే హీరో హీరోయిన్లకు ఫిట్నెస్ తప్పనిసరి. ఇలా మైంటైన్ చేయడానికి హీరో లేదా హీరోయిన్లు ఈరోజు జిమ్ కు వెళ్లడం అలాగే డైట్ ఉన్న ఆహారం తీసుకోవడం వంటివి చేస్తుంటారు. అయినా కొన్ని కారణాల వలన హీరోయిన్లు కొన్ని కొన్ని సార్లు బరువు పెరుగుతారు. పెరిగిన బరువును తగ్గించుకోవడానికి వాళ్ళు వ్యాయామం చేయడం వంటివి చేస్తుంటారు. కొన్ని అనారోగ్య కారణాల వలన బరువు పెరిగిన హీరోయిన్లు కూడా ఉన్నారు. కానీ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా నెలదొక్కుకోవాలంటే ఫిట్నెస్ మైంటైన్ చేయడం అన్నది చాలా ముఖ్యం. ఈ క్రమంలోనే హీరోయిన్లు బరువు తగ్గించుకోవడానికి అనేక మార్గాలను ఎంచుకుంటారు. అలా ఒక హీరోయిన్ కూడా ఒకానొక దశలో 30 కేజీలు బరువు తగ్గినట్లు తెలిపారు. ఆమె మరెవరో కాదు బందీశ్ బందిట్స్ మూవీ హీరోయిన్ శ్రేయ చౌదరి. శ్రేయ చౌదరి తనకు 19 ఏళ్ల వయసులో వెన్నెముక సమస్యతో విపరీతంగా బరువు పెరిగిందట. అయితే ఆమె తన ఐడల్ హీరో రుతిక్ రోషన్ ను పూర్తిగా తీసుకొని తన ఫిట్నెస్ జర్నీని ప్రారంభించినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే శ్రియా చౌదరి మానసికంగానే కాకుండా, శారీరకంగా కూడా దృఢంగా మారినట్లు చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని హీరోయిన్ శ్రేయ చౌదరి ఎస్ఎం లో పోస్ట్ చేసినప్పుడు అభిమానులు కూడా తనకు మద్దతుగా నిలిచారని చెప్పుకొచ్చారు. ఈమె నటించినా కొన్ని ప్రాజెక్టులు iffi లో ప్రదర్శించబడ్డాయి. ది మెహతా బాయ్స్ లో శ్రేయ చౌదరి జరా పాత్రలో నటించడం జరిగింది.
ఇక ఈమె నటించిన బందీశ్ బందిట్స్ కూడా ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 13 నుంచి ప్రసారంలో ఉంది. శ్రేయ చౌదరికి బందీశ్ బందిట్స్ తో మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. శ్రేయ చౌదరికి గోవా చాలా ఇష్టమైన హాలిడే స్పాట్. ఈమె నటించిన సినిమాలు బందీశ్ బందిట్స్ 2 మరియు ది మెహతా బాయ్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రీమియర్ గా ప్రదర్శించబడ్డాయి. ఇటీవల హీరోయిన్ శ్రేయ చౌదరి ఇండియా టుడే తో మాట్లాడిన ఇంటర్వ్యూలో 2024 సంవత్సరం చివరలో తనకు బాగా గుర్తుండి పోయేలాగా ఉందని, తనకు బాగా కలిసి వచ్చిందని తెలిపారు.
ఇక తనకు సంబంధించిన తదుపరి సినిమాల గురించి కూడా పలు విషయాలను పంచుకున్నారు. అభిమానులు త్వరలో తన చిత్రాన్ని చూస్తారని నేను ఆనందిస్తున్నాను.అలాగే నేను వారి కోసం ఏక కాలంలో షూటింగ్ చేయడం నాకు చాల ఆనందంగా ఉందని తెలిపారు.ఇక 2024 సంవత్సరం తనకు పెద్ద ఎత్తులో ముగిసింది అని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.ది మెహతా బాయ్స్ సినిమా లో ఈమె జార పాత్రను పోషించినట్లు తెలిపారు.