Shraddha Srinath Vacation Photos: హీరోయిన్ శ్రద్ధ శ్రీనాధ్(Shraddha Srinath) సరికొత్త లుక్ దర్శనం ఇచ్చింది. ఎవరూ ఊహించని విధంగా బికినీ ధరించి మైండ్ బ్లాక్ చేసింది. మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న శ్రద్ధ శ్రీనాధ్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Also Read: కోటాను చూసి వెక్కి వెక్కి ఏడ్చిన బ్రహ్మానందం… వీడియో వైరల్
పలు భాషల్లో సినిమాలు చేస్తూ సౌత్ లో పాపులారిటీ దక్కించుకుంది శ్రద్ధ శ్రీనాధ్. 2015లో శ్రద్ధ శ్రీనాధ్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. మలయాళ చిత్రం కోహినూర్ తో ప్రేక్షకులను పలకరించింది. అనంతరం కన్నడ, తమిళ్ చిత్రాల్లో శ్రద్ధ నటించింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ గా శ్రద్ధ పేరు తెచ్చుకుంది. ఇక తెలుగులో శ్రద్ధ మొదటి చిత్రం జెర్సీ. నాని హీరోగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీ ప్రేక్షకుల ఆదరణతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. జెర్సీ మూవీలో శ్రద్ధ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు.
లవర్, వైఫ్, ఏజ్డ్ వైఫ్ గా మూడు భిన్నమైన గెటప్స్ లో శ్రద్ధ నటించింది. జెర్సీ చిత్రాన్ని హిందీలో అదే టైటిల్ తో షాహిద్ కపూర్ రీమేక్ చేయడం విశేషం. అనంతరం తెలుగులో జోడి, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలు చేసింది. కృష్ణ అండ్ హిజ్ లీల పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. వెంకటేష్ 75వ చిత్రం సైన్ధవ్ లో శ్రద్ధ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు.
బాలయ్యతో జతకట్టిన శ్రద్ధ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. 2025 సంక్రాంతి చిత్రం డాకు మహారాజ్ లో శ్రద్ధ నటించింది. డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన డాకు మహారాజ్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక శ్రద్ధ లేటెస్ట్ మూవీ కలియుగమ్. ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో విడుదల చేశారు. మిక్స్డ్ రివ్యూస్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు వెర్షన్ ఆహాలో అందుబాటులో ఉంది.
కాగా శ్రద్ధ మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. సాగర తీరంలో బికినీలో సూపర్ గ్లామరస్ ఫోజుల్లో దర్శనం ఇచ్చింది. హోమ్లీ రోల్స్ కి కేరాఫ్ అయిన శ్రద్ధ గ్లామరస్ లుక్ వైరల్ అవుతుంది. ఇంస్టాగ్రామ్ లో శ్రద్ధ ఈ ఫోటోలు పోస్ట్ చేయగా, నెటిజన్స్ తమదైన రీతిలో రియాక్ట్ అవుతున్నారు. కామెంట్స్, లైక్స్ తో అభిమానం చాటుకుంటున్నారు.