Star Heroine: ‘శ్రద్ధా కపూర్’ మూడేళ్ళ క్రితం ‘పాన్ ఇండియా నెంబర్ వన్ హీరోయిన్’. అప్పటి ఫామ్ ను బట్టి.. శ్రద్ధా ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకున్నారు. కానీ, ఆమె ఎక్కడికో పడిపోయింది. ‘చిచోరే’ వంటి వరుస సూపర్ హిట్ సినిమాల తర్వాత కెరీర్ ఎలా ఉండాలి ? కచ్చితంగా జెట్ స్పీడ్ తో దూసుకెళ్తుంది అనుకున్నారంతా. పైగా ‘సాహో’ కూడా హిందీలో భారీ కలెక్షన్స్ రాబట్టింది.
సాహో తర్వాత ‘శ్రద్ధా కపూర్’ డేట్లు కోసం పాన్ ఇండియా మేకర్స్ ఎగబడ్డారు. కానీ, శ్రద్ధా ఏ సినిమా చేయలేదు. కారణం.. రోహన్ అనే తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవాలని శ్రద్ధా ఆశ పడింది. కానీ, అంతలో ఆ బంధంలో పగుళ్లు వచ్చి.. ఆ ప్రేమ ఈడు బోయింది. బాయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పేసింది. ఐతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
పెళ్లి ఆలోచనలో కెరీర్ ని పట్టించుకోలేదు. వచ్చిన భారీ చిత్రాలను కూడా వదులుకుని పెద్ద తప్పే చేసింది. ఫలితంగా ఇప్పుడు ‘శ్రద్ధా కపూర్’ కెరీర్ బాగా స్లో అయిపోయింది. ఆమె రణబీర్ కపూర్ సరసన ‘లవ్ రంజన్’ డైరెక్షన్లో ఒక మూవీ మాత్రమే చేస్తోంది. ఈ 35 ఏళ్ల సుందరి చేతిలో కేవలం ఒకే సినిమానే ఉండటం ఆశ్చర్యకర విషయమే.
పాన్ ఇండియా హీరోయిన్ గా ఎంతో బిజీగా ఉండాల్సిన ‘శ్రద్ధా’.. ఇటు సౌత్ సినిమాల్లో కూడా హీరోయిన్ గా ఛాన్స్ లు అందుకోలేకపోతుంది. శ్రద్ధాకి ఇన్ స్టాగ్రామ్ లో 71 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. స్టార్ హీరోలకు కూడా ఈ రేంజ్ లో ఫాలోవర్స్ లేరు. హీరోల కంటే ఎక్కువ క్రేజ్ ఉంది శ్రద్ధా కపూర్ కి. కానీ.. ఏం లాభం ? ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యింది.
ప్రియుడు మోజులో పడి ప్రేమ అంటూ బంగారు కెరీర్ ను బూడిద పాలు చేసింది. సినిమాలను కేర్ చేయకుండా ఫామ్ కోల్పోయింది. మరి, శ్రద్ధా కపూర్ మళ్ళీ ట్రాక్ లోకి రావాలంటే.. మరో భారీ హిట్ పడాలి. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఆమె చేతిలో ఒక్క మూవీ మాత్రమే ఉంది. ఇది విడుదలయి సూపర్ హిట్ అయితేనే.. శ్రద్ధా కపూర్ కెరీర్ కి మళ్ళీ ఊపొస్తుంది. కానీ, అలా ఊపు రావడం కష్టమే.
Also Read:SaReGaMaPa Parvathi: నువ్వు పాడుతున్న శృతి ఏంటి? రాగమేంటి? గాయని ‘పార్వతి’కి షాకిచ్చిన కోటి
Recommended Videos: