https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ షోలో కేవలం తెలుగోళ్లు మాత్రమే ఉండాలా?..గౌతమ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు..ఓ తెలుగోడా మేలుకో అంటూ కామెంట్స్!

బిగ్ బాస్ టీం ఉద్దేశపూర్వకంగానే గౌతమ్ ని కాదని, నిఖిల్ ని గెలిపించారని, ఇది చాలా పెద్ద కుట్ర అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో ఈ సీజన్ మొదలైనప్పటి నుండి కన్నడ వెర్సస్ తెలుగు గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. అనేకమంది రివ్యూయర్స్ అసలు ఇది తెలుగు బిగ్ బాస్ షోనా?, లేకపోతే కన్నడ బిగ్ బాస్ షోనా?, అసలు ఎవరు వీళ్ళను ఎంచుకున్నది అంటూ ప్రత్యేకంగా వీడియోలు చేసి విరుచుకుపడ్డారు.

Written By:
  • Vicky
  • , Updated On : December 18, 2024 / 05:22 PM IST

    Goutham comments On Bigg Boss Show

    Follow us on

    Bigg Boss Telugu 8 :  ఈ సీజన్ ఒక్కటే కాదు, భవిష్యత్తులో ఎన్ని సీజన్స్ వచ్చినా, మన ఆడియన్స్ ఈ సీజన్ లో వచ్చిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ని ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఈ సీజన్ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యేది. ముఖ్యంగా గౌతమ్ కృష్ణ అద్భుతంగా గేమ్ ని ఆడి, టైటిల్ విన్నింగ్ కి అతి చేరువలో వచ్చి రన్నర్ గా మిగిలాడు. గౌతమ్ ని కాకుండా నిఖిల్ ని విన్నర్ గా ప్రకటించినందుకు సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్రమైన నిరసన వ్యక్తం చేసారు. బిగ్ బాస్ టీం ఉద్దేశపూర్వకంగానే గౌతమ్ ని కాదని, నిఖిల్ ని గెలిపించారని, ఇది చాలా పెద్ద కుట్ర అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో ఈ సీజన్ మొదలైనప్పటి నుండి కన్నడ వెర్సస్ తెలుగు గొడవలు జరిగిన సంగతి తెలిసిందే.

    అనేకమంది రివ్యూయర్స్ అసలు ఇది తెలుగు బిగ్ బాస్ షోనా?, లేకపోతే కన్నడ బిగ్ బాస్ షోనా?, అసలు ఎవరు వీళ్ళను ఎంచుకున్నది అంటూ ప్రత్యేకంగా వీడియోలు చేసి విరుచుకుపడ్డారు. తెలుగు బిగ్ బాస్ షో లో తెలుగోళ్లకు అవకాశాలు ఇవ్వకుండా, మొత్తం కన్నడ వాళ్ళకే అవకాశాలు ఇచ్చుకుంటే ఇక తెలుగు బిగ్ బాస్ షో అని అనడం ఎందుకు అంటూ బహిరంగంగా కొంతమంది రివ్యూయర్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇదే విషయాన్ని రన్నర్ గా నిల్చిన గౌతమ్ ని ఒక మీడియా రిపోర్టర్ ఇంటర్వ్యూ లో అడగగా ‘నా ఉద్దేశ్యంలో ఒక తెలుగువాడిగా, మన తెలుగు లో ఎంతో మంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు. నేడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు భారత దేశం మొత్తం చూస్తుంది. అంతటి ప్రతిభ గల వాళ్ళు మన దాంట్లో ఉన్నారు. వాళ్ళను కంటెస్టెంట్స్ గా తీసుకుంటే, వాళ్లకు ఒక మంచి కెరీర్ ని ఇచ్చిన వాళ్ళు అవుతారు’ అంటూ చెప్పుకొచ్చాడు.

    ఇంకా ఆయన మాట్లాడుతూ ‘తెలుగు వాళ్ళు ఎందుకు బిగ్ బాస్ షో కి అవసరం అంటున్నాను అంటే, నామినేషన్స్ సమయంలో ఏదైనా మనం ఒక పదం బలంగా చెప్పినప్పుడు వాళ్లకు అది అర్థం కాక, ఇష్టమొచ్చినట్టు నోరు జారేసి, నాకు తెలుగు రాదు, ఉద్దేశపూర్వకంగా అనలేదు అని సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. షోలో తెలుగోళ్లు ఉంటే ఇలాంటివి జరగవు. ఒక స్వచ్ఛమైన వాదనలు జరుగుతాయి’ అంటూ చెప్పుకొచ్చాడు గౌతమ్. వీకెండ్ వస్తే పంచ కడుతాడు, ఎర్ర తువ్వాలు మెడలో వేసుకుంటాడు ఇదంతా కేవలం ఓట్ల కోసమే అని కొంతమంది రివ్యూయర్స్ చేసిన కామెంట్స్ పై ఆయన స్పందిస్తూ, మన తెలుగు సంప్రదాయాన్ని ఒక ట్రేడ్ మార్క్ గా, ఒక స్టైల్ స్టేట్మెంట్ గా తీసుకెళ్లాలని నేను ఆ ప్రయత్నం చేస్తే దానిని కూడా ఇలా అంటున్నారంటే వాళ్ళ సంస్కారానికే వదిలేస్తున్నాను అంటూ గౌతమ్ ఫైర్ అయ్యాడు.