Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు టైటిల్ విన్నర్ ఎవరనేది హాట్ టాపిక్. ప్రముఖంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. కాగా అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్. టికెట్ టు ఫినాలే గెలిచి అవినాష్ టాప్ 5 లో తన బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. మిగిలిన ఆరుగురిలో నలుగురు ఫైనల్ కి వెళ్లాల్సి ఉంది. అంటే ఇంకా ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. ఒకరు వచ్చే ఆదివారం, మరొకరు మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. కాగా గత సీజన్లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఫైనల్ కి వెళ్లారు. కాబట్టి ఈ సీజన్లో కూడా రిపీట్ కావచ్చు.
సోమవారం నుండే ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఇది కీలకమైన ఓటింగ్. కారణం ప్రేక్షకులను మెప్పించిన కంటెస్టెంట్ ఫైనల్ కి వెళతాడు. అలాగే టైటిల్ రేసులో ఉంటాడు. టైటిల్ దక్కేది ఒకరికే కాబట్టి.. ఫైనల్ కి వెళ్లడం కూడా గొప్ప విషయమే. అందుకే తమ ఫేవరేట్ కంటెస్టెంట్స్ కి ఆడియన్స్ ఓట్లు గుద్దుతున్నారు. కాగా గౌతమ్ టాప్ లో దూసుకుపోతున్నాడట. 1వ స్థానంలో గౌతమ్ ఉన్నాడట. గౌతమ్ ఒక్కడికే 32 శాతానికి పైగా ఓట్లు పోల్ అయ్యాయట. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన గౌతమ్ ని ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు.. అనిపిస్తుంది.
ఇక 2వ స్థానంలో నిఖిల్ ఉన్నాడట. ఫస్ట్ వీక్ నుండి హౌస్లో ఉన్న నిఖిల్ దే టైటిల్ అనేది చాలా కాలంగా నడుస్తున్న చర్చ. అలాగే నిఖిల్ చాలా టాస్క్ లలో విజయం సాధించాడు. కానీ గౌతమ్ నుండి నిఖిల్ కి గట్టి పోటీ ఎదురవుతుంది. బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ వీరిద్దరిలో ఒకరిది అనేది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. గౌతమ్, నిఖిల్ తర్వాత 3వ స్థానంలో ప్రేరణ ఉందట. ఈమె కూడా ఫస్ట్ డే నుండి షోలో ఉంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్. 4వ స్థానంలో రోహిణి ఉందట.
5వ స్థానంలో విష్ణుప్రియ, 6వ స్థానంలో నబీల్ ఉన్నాడట. కాబట్టి ప్రజెంట్ ఓటింగ్ ట్రెండ్ ప్రకారం నబీల్, విష్ణుప్రియలలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. విష్ణుప్రియ ఏమాత్రం గేమ్ ఆడినా.. టైటిల్ ఎగరేసుకుపోయేది. కనీసం రన్నర్ అయ్యేది. విష్ణుప్రియ ఆమె ఫ్యాన్స్ ని కూడా నిరాశపరిచింది. శుక్రవారం వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయి. సమయం ఉండగా.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి..
Web Title: Shocking results in the latest voting shock for the title favorite before the final
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com