Kantara: కన్నడ చలన చిత్ర పరిశ్రమ లో సంచలన విజయం సాధించిన కాంతారా చిత్రం తెలుగు మరియు హిందీ బాషలలో కూడా విడుదలై అదే రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఊరు పేరు తెలియని హీరో కి ఇతర బాషలలో ఈ స్థాయి ఆదరణ దక్కింది అంటే ఆ సినిమా కంటెంట్ పవర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..అయితే ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రెండు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు.

ఇప్పటి వరుకు ఈ సినిమా తెలుగు వెర్షన్ వసూళ్లు 30 కోట్ల రూపాయిల వరుకు వసూలు చేసింది..ఫుల్ రన్ లో మరో రెండు నుండి మూడు కోట్ల రూపాయిలు వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది..అల్లు అరవింద్ చీప్ గా ఈ సినిమాని కొనేసి జాక్పాట్ కొట్టేశాడని అందరూ అనుకున్నారు..కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్..ఈ సినిమా కి వచ్చిన కలెక్షన్స్ లో అల్లు అరవింద్ కి గొప్ప లాభాలేమి రాలేదట.
ఎందుకంటే ఆయన ఈ సినిమా హక్కులను పూర్తి స్థాయిలో కొనుగోలు చెయ్యలేదు..కమిషన్ బేసిస్ మీదనే చేసాడట..అంటే ఈ సినిమా తెలుగు వెర్షన్ నుండి వచ్చే షేర్ లో ఆయనకీ కేవలం పది శాతం మాత్రమే దక్కుతుందట..ఆ లెక్క ప్రకారం అల్లు అరవింద్ కి కేవలం నాలుగు కోట్ల రూపాయిల లాభాలు మాత్రమే దక్కిందని..మిగిలిన లాభాలన్నీ ఆ సినిమా నిర్మాత హోమబుల్ సంస్థ వారికే వెళ్లిందని తెలుస్తుంది..ఒకవేళ ఈ సినిమా ని ఆయన పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి ఉంటె కనీసం 20 కోట్ల రూపాయిల లాభాలు దక్కేవని..అల్లు అరవింద్ గారు పొరపాటు చేసి గొప్ప అవకాశం ని మిస్ చేసుకొని నష్టాలు చవిచూసాడని ట్రేడ్ వర్గాల్లో సాగుతున్న చర్చ.

అయితే హోమబుల్ సంస్థ వారు బిజినెస్ ఇలాగె చేస్తారట..KGF చాప్టర్ 2 కి కూడా కమిషన్ బేసిస్ మీదనే బిజినెస్ చేసారు..ఆ సినిమాకి సుమారుగా 1300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..ఈ గ్రాస్ లో 80 శాతం నిర్మాతలకు వెళ్లిందట..ఇప్పుడు కాంతారా కి కూడా అదే పద్దతి ఫాలో అయ్యి వందల కోట్ల రూపాయిలను తమ ఖాతా లో వేసుకున్నారు.